Image Credit:Amitabh Bachchan/Instagram
Amitabh Bachchan: బాలీవుడ్ పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు అమితాబ్ బచ్చన్. ఇది ఒక్క బాలీవుడ్ లోనే కాదు దేశంలో ఏ భాష ప్రేక్షకులను అడిగినా బాలీవుడ్ అనగానే ముందు అమితాబ్ పేరే చెప్తారు. అంతలా ఆయన తన సినిమాలు ప్రేక్షకులపై ప్రభావం చూపుతాయి. ఆయన దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు చూడటానికే కాదు ఆయన్ను ప్రత్యక్షంగా ఒక్కసారి చూస్తే చాలు అనుకునే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అందుకే ఆయన్ను చూడటానికి వేలాది మంది అభిమానులు ఆయన ఇంటి గేట్ వద్ద వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకే ప్రతీ ఆదివారం ఆయన తన ఇంటి బాల్కని నుంచి తన కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు అభివాదం చేస్తుంటారు. ఈ విషయాన్ని ఇటీవల అమితాబ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వివరించారు. దానితో పాటు కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు బిగ్ బి.
ఎంతో మంది అభిమానులు తమ ఫేవరేట్ హీరో ను ఓసారి చూడాలి అని కోరుకుంటారు. కానీ ఆ అవకాశం అస్తమాను దొరకదు. కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం అలా చేయలేదు. తనను చూడటానికి చాలా మంది అభిమానులు తన ఇంటి బయట ఎండలో గంటల తరబడి నిలబడి వెయిట్ చేస్తారనే ఉద్దేశంతో వారి కోసం ప్రత్యేకంగా ఓ రోజును కేటాయించారట అమితాబ్. ఈ విషయాన్ని తన పోస్ట్ లో రాసుకొచ్చారు. ప్రతీ ఆదివారం తాను తన ఇంటి బాల్కని నుంచి తన అభిమానులకు అభివాదం చేస్తానని చెప్పారు. అంతే కాదు తన అభిమానులను కలిసే సమయంలో కాళ్లకు చెప్పులు కూడా ధరించను అని చెప్పారు. దానికి గల కారణాన్ని కూడా వివరించారు బిగ్ బి. ఎవరైనా గుడికి వెళ్తే చెప్పులు తీసేసి వెళ్తారు. తన అభిమానులు కూడా తనకు దేవుళ్లతో సమానం అందుకే వారిని కలిసేటపుడు చెప్పులు తీసేస్తానని చెప్పారు. ఒకవేళ తాను ఆదివారం అందుబాటులో ఉండకపోతే రెండ్రోజుల ముందే చెబుతారట. ఈ సాంప్రదాయాన్ని దాదాపు 50 ఏళ్లుగా ఇలాగే కొనసాగిస్తున్నానని చెప్పారు. అంతే కాదు అలా తనకోసం ఎండలో నిలబడి వెయిట్ చేస్తున్న అభిమానుల దాహం తీర్చడం కోసం అక్కడ ఒక నాలుగు మంచి నీళ్ల ట్యాంకర్లను ఏర్పాటు చేశారట అమితాబ్. అందుకే ఆయన్ను అభిమానులు అంతగా ఆదరిస్తారు.
అమితాబ్ ఇటీవలే తన 50వ వివాహ వార్షికోత్సవాన్నిబార్య జయ బచ్చన్‌తో జరుపుకున్నారు. 1973 జూన్ 3న జయ బాదురి మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు వేశారు అమితాబ్ బచ్చన్. పెళ్లికి ముందు ఈ జంట కలసి పలు సినిమాల్లో నటించారు కూడా. వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ఒక బ్లాగ్ ను కూడా రాసుకొచ్చారు అమితాబ్. అంతే కాదు కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇక బిగ్ బీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ప్రాజెక్ట్-కె’ లో నటిస్తున్నారు. దీనితో పాటు అమితాబ్ ప్రస్తుతం ‘సెక్షన్ 84’ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
Also Read: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - బీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
Prema Entha Madhuram September 22nd: అనుకి వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవి, మాన్సీ - ఆర్యని ఇంటికి తీసుకొచ్చిన అక్కి!
Trinayani September 22nd Episode: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!
Naveen Polishetty: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి
Jagapathi Babu: కుర్రాడిగా మారేందుకు జగ్గూ భాయ్ పాట్లు.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?
VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్
వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా
జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- అచ్చెన్న, అశోక్ సస్పెన్డ్
Singareni workers: సింగరేణి కార్మికుల అకౌంట్లలో రూ.లక్షలు జమ-త్వరలోనే పండుగ బోనస్
Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?
/body>