అన్వేషించండి

ముద్దు సీన్లలో ఇబ్బంది పడలేదు - అనూతో ప్రేమాయణంపై క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్

అల్లు శిరీష్.. అనూ ఇమ్మాన్యుయెల్‌తో రిలేషన్‌లో ఉన్నాడా? దీనిపై అతడి స్పందన ఏమిటీ? ఏం చెప్పాడు?

సినిమా ఇండస్ట్రీ అంటే ఓ రంగుల ప్రపంచం. ఇందులోకి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. కొంతమంది ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ లుగా నిలదొక్కుకుంటారు. కొంతమంది బ్యాగ్రౌండ్ ఉన్నా ఓ సరైన హిట్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ఒకరు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్లు గడుస్తున్నా శిరీష్ కి ఇప్పటిదాకా సరైన బ్లాక్ బ్లస్టర్ రాలేదు. అల్లు శిరీష్ తాజాగా 'ఊర్వశివో రాక్షశివో' సినిమా నటించారు. ఈ సినిమాపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కూడా. అయితే ఇప్పుడు అల్లు శిరీష్ కి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. సినిమాలో హీరోయిన్ గా నటించిన అను ఇమ్మాన్యుయేల్‌తో శిరీష్ రిలేషన్షిప్ లో ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఛానెల్  ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వార్తలపై స్పందించారు. ఓ కొత్త సినిమా వస్తున్నప్పుడు ఇలాంటి వార్తలు సహజమేనని అన్నారు. నిజంగా తమ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని తేల్చిచెప్పేశారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల్ని కొట్టిపారేశారు ఈ యువహీరో. తామిద్దరం మంచి స్నేహితులమని అన్నారు. అయితే అను ఇమ్మాన్యుయేల్‌ కు తనకూ అభిరుచులు కొంతమేర కలిశాయని అవే తమని మంచి ఫ్రెండ్స్ గా మార్చాయని చెప్పారు. వాస్తవంగా నెలల పాటు ఓ సినిమా తీస్తున్నామంటే అందులో పనిచేసే వారి మధ్యలో మంచి స్నేహాభావం ఏర్పడుతుందని, అది సహజమని అన్నారు. అలాగే వారిద్దరికీ స్నేహం కుదిరిందని చెప్పుకొచ్చారు. 

గతంలోనూ తనపై ఇలాంటి రూమర్స్ చాలా వచ్చాయన్నారు. ప్రతీ సినిమాకు ఏదొక గాసిప్ బయటకు వస్తూనే ఉంటుందని, అందుకే తాము చాలా వరకూ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నామని అన్నారు. వర్క్ విషయంలో అను ఇమ్మాన్యుయల్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటుందని. అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అందుకే సినిమాలో ముద్దు సీన్ లు కూడా ఇబ్బంది లేకుండా చేశామని అన్నారు. లేకపోతే ఆ సీన్స్ విషయంలో కొంత ఇబ్బంది అయ్యేదని చెప్పారు. 

సినిమా విషయంలో ముందునుంచే డైరెక్టర్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారని అన్నారు. హీరో క్యారెక్టరైజేషన్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతీ అంశంపై తాము ముందే బిల్డ్ చేసి తర్వాతే సినిమా ప్రారంభించామని చెప్పారు శిరీష్. సినిమా చాలా బాగా వచ్చిందని, ఈ సినిమాలో తన క్యారెక్టర్ యువతను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ప్రతీ ఒక్కరి జీవితాలకు దగ్గరగా ఉన్నట్టు ఈ సినిమాలో  క్యారెక్టర్ ఉంటుందన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే విధంగా సినిమా ఉంటుందని తెలిపారు. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా  వచ్చే నెల 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్నాళ్ళ నుంచో ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న అల్లు శిరీష్‌కు ఈ సినిమా అయినా మంచి హిట్ ఇస్తుందేమో చూడాలి.

Also Read: ‘ప్రిన్స్’పై భారీ అంచనాలు, అనుదీప్‌కు అగ్నిపరీక్షే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget