Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా?
Allu Arjun wax statue at Madame Tussauds: దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ తన వాక్స్ స్టాట్యూ ఆవిష్కరించారు. పుష్పరాజ్ స్టైల్‌లో 'తగ్గేదే లే' అంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
Allu Arjun shares first selfie with his wax statue: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రయాణంలో ఎప్పటికీ మర్చిపోలేని ఓ మధుర జ్ఞాపకం 'పుష్ప' సినిమా. పుష్పరాజ్ పాత్రలో ఆయన నటన ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకుంది. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా ఆయన పేరును చరిత్రకు ఎక్కించింది. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రయాణంలో మరో మేలు మజిలీ చోటు చేసుకుంది. దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన వాక్స్ స్టాట్యూ ఆవిష్కరించారు.
పుష్పరాజ్... తగ్గేదే లే!
'తగ్గేదే లే' అంటూ 'పుష్ప: ది రైజ్' సినిమాలో అల్లు అర్జున్ గడ్డం కింద చెయ్యి పెట్టుకుని తీసే మ్యానరిజం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అదే మ్యానరిజంలో టుస్సాడ్స్ మ్యూజియం, దుబాయ్‌లో వాక్స్ స్టాట్యూ ఏర్పాటు చేశారు.
బ్లాక్ ప్యాంట్, వైట్ కలర్ షర్ట్ మీద రెడ్ కలర్ సూట్... యాజ్ ఇట్ ఈజ్ అల్లు అర్జున్ నిలబడ్డారనే విధంగా ఆయన మైనపు విగ్రహాన్ని దుబాయ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు తయారు చేశారు. సేమ్ టు సేమ్ డ్రస్ వేసుకుని, సేమ్ మ్యానరిజం చూపిస్తూ... తన వాక్స్ స్టాట్యూ పక్కన నిలబడి అల్లు అర్జున్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
''ప్రతి నటుడి జీవితంలో ఇదొక మైలురాయి వంటి అనుభవం. ఈ రోజు నా వాక్స్ స్టాట్యూ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. అయామ్ హంబుల్డ్'' అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
Here we go #MadameTussaudsdubai #ThaggedheLe pic.twitter.com/HuOveipJiO
— Allu Arjun (@alluarjun) March 28, 2024
'పుష్ప 2' కోసం వెయిట్ చేస్తున్న అభిమానులు!
'పుష్ప: ది రైజ్' ఘన విజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్ 'పుష్ప: ది రూల్' మీద అంచనాలు పెరిగాయి. ఇప్పుడు అభిమానులు ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లడంతో చిన్న బ్రేక్ ఇచ్చారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. 'పుష్ప'కు మూడో పార్ట్ కూడా ఉంటుందని యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 'పుష్ప: ది రోర్' టైటిల్ కూడా ఖరారు చేశారట.
Also Read: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వంలో సినిమాను ముందు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తనకు 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' వంటి విజయవంతమైన సినిమాలు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ కథ రెడీ చేస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీ సైతం అల్లు అర్జున్ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారు. ఆ ఇద్దరిలో ఎవరి సినిమా ముందు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నారు. రణబీర్ కపూర్ 'యానిమల్ పార్క్', ప్రభాస్ 'స్పిరిట్' తర్వాత ఆ సినిమా మొదలు కావచ్చు.