(Source: ECI/ABP News/ABP Majha)
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
Kaliyugam Pattanamlo Actress Aayushi Patel Interview: నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తానని చెబుతోంది ఆయుషి పటేల్. ఆమె నాయికగా నటించిన 'కలియుగం పట్టణంలో' విడుదల నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూ...
లిప్ లాక్స్, ఎక్స్‌పోజింగ్ వంటివి తనకు నచ్చవని స్పష్టంగా చెప్పేసింది యంగ్ హీరోయిన్, తెలుగమ్మాయి ఆయుషి పటేల్. ఆ రెండూ నచ్చని కారణంగా చాలా సినిమాలు ఒప్పుకోలేదని వివరించింది. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తాను సినిమా ఇండస్ట్రీలోకి రాలేదని, కొన్ని సినిమాలు చేసినా మంచి మంచి చిత్రాలు చేయాలనుకుంటున్నానని స్పష్టం చేసింది. నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు తన ఓటు అని చెప్పింది. ఆయుషి పటేల్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'కలియుగం పట్టణంలో'. థియేటర్లలో నేడు (మార్చి 29, శుక్రవారం) విడుదల. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విశేషాలు...
''ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. క్యారెక్టర్‌లో మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి. రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాదు. ఒక్కో సన్నివేశంలో ఒక్కోలా... నా పాత్ర మీద ఇంటర్వెల్ టైంలో ఒక విధమైన, పతాక సన్నివేశాల్లో మరో విధమైన అభిప్రాయం ప్రేక్షకుల్లో కలుగుతుంది'' అని ఆయుషి పటేల్ చెప్పింది.
ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది!
గురువారం రాత్రి హైదరాబాద్, కర్నూల్... ఇలా కొన్ని స్క్రీన్లలో 'కలియుగం పట్టణంలో' స్పెషల్ ప్రీమియర్ షోలు వేశారు. వాటికి మంచి స్పందన లభించిందని ఆయుషి పటేల్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రీమియర్ షోల కంటే ముందు ప్రమోషనల్ టూర్స్ చేశామని, అప్పుడు మంచి బజ్ వచ్చిందని చెప్పింది.
'కలియుగం పట్టణంలో' సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందీ వివరిస్తూ... ''చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టం. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. ఆయనలా ఎదగాలని కోరిక. దాంతో ఛాన్సుల కోసం ట్రై చేశా. నా మేనేజర్ చెబితే ఈ మూవీకి ఆడియన్స్ ఇచ్చా. కొన్ని రోజులకు సెలెక్ట్ అయ్యానని చెప్పారు'' అని పేర్కొంది.
వర్క్ షాప్స్ చేశాం... దర్శకుడు కట్ చెప్పేవారు కాదు!
'కలియుగం పట్టణంలో' సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు హీరో విశ్వ కార్తికేయతో సన్నివేశాల గురించి డిస్కస్ చేశానని, దర్శకుడు రమాకాంత్ రెడ్డి నటీనటులకు వర్క్ షాప్స్ నిర్వహించారని ఆయుషి పటేల్ చెప్పింది. ఇంకా ఆమె మాట్లాడుతూ... ''దర్శకుడు రెండు గంటలకు పైగా స్టోరీ నెరేట్ చేశారు. కథపై ఎంతో క్లారిటీతో ఆయన సినిమా తీశారు. షూటింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కట్ చెప్పరు. కట్ చెబితే ఎండ్‌లో వచ్చే ఎక్స్‌ప్రెషన్స్ మిస్ అవుతాయని అనేవారు. చెప్పిన కథను అద్భుతంగా తీశారు. రీ రికార్డింగ్ వల్ల సినిమా మరోస్థాయికి వెళ్లింది'' అని చెప్పింది. కడపలోని అందమైన లొకేషన్లలో షూటింగ్ చేశామని వివరించింది. అప్పుడు నిర్మాతలు తమకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారని, ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా సినిమా తీయడంతో పాటు భారీగా ప్రమోషన్స్ చేశారని సంతోషం వ్యక్తం చేసింది.
Also Read: ఆడు జీవితం రివ్యూ: సౌదీలో కూలీల కష్టాలు చూడగలమా? - పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ఎలా ఉందంటే?
ప్రస్తుతం విశ్వ కార్తికేయతో ఇంకో సినిమా చేస్తున్న ఆయుషి పటేల్... మరో రెండు సినిమాలకు సంతకం చేశారు. ఇప్పుడు ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇటీవల త్రిగుణ్, ఆయుషి పటేల్ నటించిన ఇండిపెండెంట్ మ్యూజిక్ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది.