Allu Arjun - Allu Sneha: భార్యకు ప్రేమతో - అల్లు అర్జున్, స్నేహారెడ్డి పెళ్లి రోజు - బన్నీ పోస్ట్‌కు ఫ్యాన్స్ ఫిదా!
మార్చి 6న అల్లు అర్జున్ - స్నేహరెడ్డి పెళ్లి రోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఓ స్పెషల్ పోస్ట్ తో తన భార్యకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.
టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటన, డాన్స్, స్టైల్ తో ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన ‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఇటు సినిమాలతో పాటు అటు సోషల్ మీడియాలోనూ ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే ఆయన సతీమణి స్నేహరెడ్డి కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని 2011లో వివాహం చేసుకున్నారు. వీరికి అల్లు అయాన్, అర్హా ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. మార్చి 6న వీరి పెళ్లి రోజు కావడంతో తన భార్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అల్లు అర్జున్. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారాయన. ‘హ్యపీ యానివర్సరీ క్యూటీ’ అంటూ లవ్ సింబల్‌తో ఆమెపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. అంతేకాకుండా భార్యతో దిగిన ఓ బ్యూటిఫుల్ ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు.
ఇక స్నేహరెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఆమెకు నెట్టింట మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటారామె. తన గ్లామర్ తో హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటాయి స్నేహరెడ్డి ఫోటోలు. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే తన ఫ్యామిలీకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు స్నేహరెడ్డి. ఇటీవలే అల్లు అర్జున్ ఫ్యామిలీ తల్లి తండ్రీ, అన్న, వదినా, తమ్ముడు శిరీష్, భార్యా పిల్లలతో కలసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. ప్రస్తుతం అల్లు అర్జున్ పెళ్లి రోజు సందర్భంగా ఆయన చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో పాటలు, డైలాగ్ లు చాలా రోజుల పాటు ట్రెండ్ అయ్యాయి కూడా. దీంతో ఈ మూవీ సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు పెరిగాయి. అందుకే ఈ మూవీ విషయంలో చిత్ర బృందం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్ చాలా సినిమాలకు నో చెప్తున్నారు. ఇటీవలే ఓ బడా బాలీవుడ్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా ‘పుష్ప 2’ కోసం ఆ మూవీకు నో చెప్పారట అల్లు అర్జున్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల తార రష్మిక నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయనున్నారు.
Happy Anniversary Cutie 🖤 #AlluSnehaReddy pic.twitter.com/lWEJRfuQZH
— Allu Arjun (@alluarjun) March 6, 2023