X

Allu Arjun-Sri Chaitanya: ఫస్ట్ టైం కార్పొరేట్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ హీరో

ఇప్పటి వరకూ చాలా వాణిజ్య ప్రకటనల్లో కనిపించిన అల్లు అర్జున్ ఈ సారి రూటు మార్చాడు. గతంలో తను మాత్రమే కాదు ఏ హీరో అడుగుపెట్టని రంగాన్ని ప్రమోట్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

FOLLOW US: 

సబ్బులు, షాంపూలు, సెంట్లు, పౌడర్లు, రియల్ ఎస్టేట్ ఇలా అన్ని ప్రకటనల్లోనూ స్టార్ హీరోలు మెరుస్తున్నారు. కానీ అల్లు అర్జున్ రూటు మార్చాడు. ఇప్పటి వరకూ  కోలా కంపెనీలు .. మ్యాంగో బేవరేజెస్, రెడ్ బస్ సహా పలు ప్రకటనల్లో కనిపించిన బన్నీ  ఈసారి అందుకు భిన్నంగా ఓ కార్పొరేట్ విద్యా సంస్థను, దానికి అనుబంధంగా ఉన్న కోచింగ్ సెంటర్లను ప్రమోట్  చేస్తున్నాడు.

 తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న సంస్థల్లో ఒకటైన  శ్రీచైతన్యకు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. దశాబ్దాలుగా శ్రీచైతన్య విద్యా సంస్థ పాఠశాలలు  జూనియర్ కళాశాలల్లో టాప్ ర్యాంకర్లను అందించింది. దశాబ్ధాలుగా మనుగడ సాగిస్తోన్న ఈ సంస్థకు సంబంధించి తాజా ప్రకటనలో ``ఐఐటి సక్సెస్ కోసం శ్రీ చైతన్య బెస్ట్`` అంటూ బన్ని ప్రచారం చేస్తున్నాడు. ఈ ప్రకటనలో స్టైలిష్ స్టార్ కళాశాల విద్యార్థలతో పాటూ కనిపిస్తున్నాడు. `మీ సక్సెస్ కోసం శ్రీ చైతన్య ని ఎంచుకోవడం లో మాత్రం తగ్గేదే లే`` అంటూ ప్రమోట్ చేయడం ఆసక్తికరం. విద్యారంగంలో అల్లు అర్జున్ మాత్రమే కాదు ఓ స్టార్ హీరో ప్రచారం చేయడం ఇదే తొలిసారి కాగా శ్రీ చైతన్య ఇలా ఒక సినీహీరోతో ప్రచారం చేయించడం ఇదే మొదటిసారి. ఇక స్టార్ హీరోగా బన్ని బిజీ షెడ్యూల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ' పుష్ప'  తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ పార్ట్ 1 ఈ డిసెంబర్లో విడుదలవుతుంది.  సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్. పాన్ ఇండియా కేటగిరీలో  తెలుగు, తమిళం,మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఒకేసారి  విడుదల కానుంది. పార్ట్ -1 ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనుండగా ఇక గిరిజన యువతి, పాలు సప్లై చేసే అమ్మాయిగా రష్మిక కనిపించనుందని ఇప్పటికే విడుదలైన సెకెండ్ సింగిల్ సాంగ్ లో తెలుస్తోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా సునిల్ మరో విలన్ గా కనిపిస్తాడని టాక్. ఇక బన్ని-రష్మిక  మధ్య వచ్చే సన్నివేశాలు , చిత్తూరు మాండలికం ప్రేక్షకులను మెప్పిస్తాయంటున్నారు.  సంక్రాంతి 2022కి స్లాట్స్ కిటకిటలాడుతుండడంతో బన్నీ కొన్ని రోజులు ముందుగానే అంటే క్రిస్మస్ కానుకగా వచ్చేందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.
Also Read: సరదాగా సాగిన లగ్జరీ బడ్జెట్ టాస్క్…ఈ వారం వరస్ట్ పెర్ఫామర్ గా జైలుకెళ్లిందెవరంటే…
Also Read: పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన బాహుబలి విలన్
Also Read: 'స్వామిరారా' టీమ్ మూడోసారి…
Also Read: వరుడు కావలెను' సినిమా విడుదల ఎప్పుడంటే...
Also Read: క్రేజీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ తర్వాతి సినిమా.. పండగ రోజు రెండు కొత్త సినిమాలతో చెర్రీ రచ్చ!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Allu Arjun Promoting Corporate Educational Institution Sri Chaitanya

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: టాప్ లో సన్నీ.. లాస్ట్ లో సిరి.. నామినేషన్ లో ఐదుగురు..

Bigg Boss 5 Telugu: టాప్ లో సన్నీ.. లాస్ట్ లో సిరి.. నామినేషన్ లో ఐదుగురు..

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

The wrong swipe: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది

The wrong swipe: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది

Prabhas: 'సలార్' సినిమా రీషూటింగ్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్.. 

Prabhas: 'సలార్' సినిమా రీషూటింగ్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్.. 

BiggBoss5: పింకీకి బిగ్‌షాక్... మానస్‌ను తన పిల్లాడిలా చూసుకునేదాన్నంటూ ఏడుపు

BiggBoss5: పింకీకి బిగ్‌షాక్... మానస్‌ను తన పిల్లాడిలా చూసుకునేదాన్నంటూ ఏడుపు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం