Alitho Saradaga Promo: ఆ సినిమా చేసి బాధపడ్డా - బాలయ్య ముందు ఏ సూపర్ మ్యాన్ పనికిరాడు: సీనియర్ నటి రాధ
నటసింహం బాలయ్యపై సీనియర్ నటి రాధ ప్రశంసల జల్లు కురిపించింది. ఏ సూపర్ మ్యాన్ బాలయ్య ముందు పనికి రాడాని చెప్పింది. ‘అలీతో సరదాగా’ షోలో పాల్గొన్న ఆమె పలు వ్యక్తిగత విషయాలను వెల్లడించింది.
Alitho Saradaga Latest Promo: తెలుగు సినిమా అభిమానులకు సీనియర్ నటి రాధ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో దాదాపు అందరు అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. పెళ్లి తర్వాత నెమ్మదిగా సినీ పరిశ్రమకు దూరం అయ్యింది. కొంతకాలం పాటు భర్తతో పాటు తన బిజినెస్ లను చూసుకున్న ఆమె, ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా రాణిస్తోంది. ఇక ఆమె కూతురు కార్తిక సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టినా, అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఒకటి రెండు సినిమాలు మంచి హిట్ అందుకున్నా, ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో సినిమాలకు ఫుల్ స్టాఫ్ పెట్టింది. నెమ్మదిగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. దుబాయ్ లోని తన ఫ్యామిలీకి సంబంధించిన హోటల్స్ వ్యాపారాలను చూసుకుంటోంది.
‘అలీతో సరదాగా’ షోలో పాల్గొన్న రాధ
తాజాగా అందాల తార రాధ ‘అలీతో సరదాగా’ షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా అలీ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. ఫన్నీ ఫన్నీగా కొనసాగిన ఈ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. “చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు.. మీ జోలికి ఎవరైనా వస్తే అంతేనా? అని అలీ అడగడంతో.. “కసక్ మని గొంతు కోసేస్తా” అంటుంది రాధా. ఈ సందర్భంగా నటసింహం నందమూరి బాలయ్యపై పొగడ్తల వర్షం కురిపించింది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఎవరొచ్చినా.. బాలయ్య దగ్గర నిలువలేరంటూ ప్రశంసించింది. ఆయన అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. ఇక తన భర్త ఎక్కువగా మాట్లాడరని వెల్లడించింది. రాధ చిన్ననాటి రోజులను అలీ గుర్తు చేస్తూ “ క్లాస్ లో బాగా చదివేవారంట, హ్యాండ్ రైటింగ్ ముత్యాల్లా ఉంటుందట” అని టీజ్ చేస్తారు. “హ్యాండ్ రైటింగ్ బాలేకుంటే తలరాత బాగుటుంది” అని చెప్పుంది రాధ. తాను సేమ్ చిరంజీవి గారిలాగే డ్యాన్స్ చేసేదాన్నని చెప్పిన ఆమె, కృష్ణ గురించి పలు విషయాలు వెల్లడించింది. ఓ సినిమా చేసిన తర్వాత చాలా బాధపడినట్లు చెప్పింది. ఇంతకీ ఆ సినిమా ఏంటనేది ఫుల్ ఎపిసోడ్ లో తెలియనుంది. తన అమ్మాయి కార్తీక కెరీర్, పెళ్లి గురించి చెప్తూ కంటతడి పెట్టుకుంది. త్వరలో ఈ షో పూర్తి ఎపిసోడ్ మార్చి 26న రాత్రి 9.30 గంటలకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
హోటల్స్ బిజినెస్ లో రాధ ఫ్యామిలీ
ఇక రాధ భర్త నాయర్ ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. భారత్ తో పాటు దుబాయ్ లోనూ వీరికి హోటల్ బిజినెస్ లు ఉన్నాయి. గత కొంతకాలంగా దుబాయ్ లోని హోటల్స్ ను కార్తీక చూసుకుంటుంది. రీసెంట్ గా ఆమె కూడా బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది. రాధ కుటుంబానికి సుమారు రూ. 300 కోట్లు వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
Read Also: రేవ్ పార్టీలకు పాము విషం సరఫరా చేస్తున్న ‘బిగ్ బాస్’ విన్నర్ - ఇంతకీ ఆ విషాన్ని ఏం చేస్తారు?