Alia Bhatt to Host Party: ‘RRR’ టీమ్‌కు అలియా గ్రాండ్ ఫార్టీ, ఎప్పుడు? ఎక్కడో తెలుసా?
‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల అలియా భట్ సంతోషం వ్యక్తం చేసింది. ‘RRR’ టీమ్ కు గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించింది.
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మూవీలోని ‘నాటు నాటు’ పాట ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుని భారతదేశాన్ని గర్వించేలా చేసింది. బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో ఈ అవార్డును పొందిన మొట్ట మొదటి భారతీయ చిత్రంగా ‘RRR’ ఘనత సాధించింది. 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో సంగీత దర్శకుడు MM కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు.
♥♥♥♥♥♥♥ https://t.co/O0Q4FWmaOO
— Alia Bhatt (@aliaa08) January 11, 2023
‘RRR’ టీమ్ కు అలియా గ్రాండ్ పార్టీ
‘RRR’ సినిమాలో కీలక పాత్ర పోషించిన అలియా భట్ ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఫీలవుతున్నట్లు వెల్లడించింది. ‘RRR’ సినిమాకు ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల ఉప్పొంగిపోయింది. ఈ అరుదైన గౌరవాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునేలా ప్లాన్ చేస్తోంది. ‘RRR’ టీమ్ కు అదిరిపోయే పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఈ సినిమా బృందం మొత్తానికి గ్రాండ్ పార్టీ అరేంజ్ చేయబోతున్నట్లు తెలిపింది. ‘RRR’ టీమ్ అమెరికా నుంచి రాగానే పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
రాజమౌళి-మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అలియా
అంతే కాదు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వెంటనే అలియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి మెసేజ్ చేసింది. ప్రతిష్టాత్మక అవార్డు ‘RRR’ సినిమాకు రావడం పట్ల రణబీర్ కపూర్ కూడా శుభాకాంక్షలు చెప్పారు. అలియా ‘RRR’ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో నటించింది. ఆమె పాత్ర ఈ సినిమాలో తక్కువగా ఉన్నప్పటికీ, చాలా మంది ప్రశంసలు కురిపించారు. సీత క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించింది. అంతేకాదు, SS రాజమౌళితో మరో సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.
ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన ‘RRR’
ఇక ‘RRR’ సినిమాలో రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషించారు. జూ. ఎన్టీఆర్ కొమురం భీమ్ క్యారెక్టర్ చేశారు. స్వాతంత్ర్య సంగ్రామ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్, శ్రియ శరణ్, సముద్రఖని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్ కీలక పాత్రల్లో నటించారు.
♥♥♥♥♥♥♥♥ https://t.co/AnsvIjnbVj
— Alia Bhatt (@aliaa08) December 12, 2022
Read Also: ‘నాటు నాటు‘ పాటపై విమర్శలా? - దిమ్మతిరిగే ట్వీట్ చేసిన పూజా భట్