News
News
X

Alia Bhatt: ఛీ, మరీ ఇంట్లోకి తొంగిచూస్తారా? - మీడియాపై అలియా ఆగ్రహం, పోలీసులకు ఫిర్యాదు

బాలీవుడ్ నటి ఆలియా భట్ కు షాకింగ్ ఘటన ఎదురయ్యింది. ఇంట్లో ఉన్న తనకు కొంత మంది ఫోటో గ్రాఫర్లు సీక్రెట్ గా ఫోటోలు తీయడాన్ని గమనించింది. వెంటనే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

FOLLOW US: 
Share:

సినీ నటుల విషయంలో నేషనల్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనే బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ కు ఎదురయ్యింది. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. వెంటనే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.?

ఆలియాను సీక్రెట్ ఫోటోలు తీసిన కెమెరామెన్

తాజాగా అలియా భట్ తన అపార్ట్‌ మెంట్‌లోని లివింగ్‌ రూమ్‌లో కూర్చొని ఉంది. అప్పుడు తనను ఎవరో గమనిస్తున్నట్లు అనుమానం కలిగింది. వెంటనే తను తలెత్తి చూడగానే,  ఇద్దరు ఫోటోగ్రాఫర్లు తమ పక్కనే ఉన్న బిల్డింగ్ టెర్రస్ నుంచి ఆమెకు ఫోటోలు తీస్తూ కనిపించారు. ఈ ఘటనతో అలియా షాక్ కు గురయ్యింది. ఈ విషయాన్ని వెంటనే ముంబై పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఇంట్లో ఉన్న వారిని సీక్రెట్ గా ఫోటోలు తీయడం అంటే తమ ప్రైవసీకి పూర్తి భంగం కలిగించడమేనని ఆలియా చెప్పింది.  తన కూతురు రాహా కపూర్ ఫోటోల కోసమే సదరు కెమెరామెన్ హద్దులు మీరి ప్రవర్తించినట్లు వెల్లడించింది.   

ఇప్పటి వరకు బయటకు రాని అలియా కూతురు ఫోటోలు  

రణబీర్ కపూర్- అలియా భట్ గతేడాది మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అయిన నెలకే తాను ప్రెగ్నెంట్ అంటూ ఆలియా షాక్ ఇచ్చింది. ఇక గతేడాది చివర్లో అమ్మాయికి జన్మనిచ్చింది. ఆమెకు రాహా కపూర్ అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు బయటకు రాలేదు. పాపతో అలియా భయకు కూడా రాలేదు. ఈ నేపథ్యంలోనే సదరు పాప ఫోటోలను ఎలాగైనా సంపాదించాలని కొందరు ఫోటోగ్రాఫర్లు ప్రయత్నించారు. అలియా భట్ అపార్ట్ మెంట్ కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ టెర్రస్ మీద నుంచి ఆమె ఇంటి వైపు కెమెరాలు పెట్టారు. ఈ విషయాన్ని గమనించిన అలియా పోలీసులకు సమాచారం ఇచ్చింది.

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అలియా భట్

ఈ ఘటనపై ఆలియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. “నేను మధ్యాహ్నం సమయంలో ఇంట్లో కూర్చుని ఉన్నాను. ఆ సమయంలో ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్లు అనిపించింది. వెంటనే బయట వైపు చూశాను. ఒక్కసారిగా షాక్ అయ్యాను. మా పక్కింటి టెర్రస్ మీద ఇద్దరు వ్యక్తులు  కెమెరాలు పట్టుకుని మా ఇంట్లోకి చూస్తున్నారు. ఈ ఘటన ముమ్మాటికీ మా ప్రైవసీని దెబ్బతీయడమే అవుతుంది. లిమిట్ క్రాస్ చేసి మా ఇంట్లోకి కెమెరాలు పెట్టారు. ఇక చాలు” అంటూ ముంబై పోలీసులకు ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ ఘటన ముంబైలో సంచలనం అయ్యింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. తాము సెలబ్రిటీలు కావచ్చు.. కానీ, ఇంట్లో తమకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అలా తొంగి చూడటం ఎంతవరకు సబబు? దేనికైనా లిమిట్ ఉంటుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

‘విరుష్క’ పాప ఫోటోల కోసం ఇంట్లోకి చొరబడిన కెమెరామెన్

ఇలాంటి ఘటనే గతంలోనూ జరిగింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ముద్దుల కూతురు వామిక ఫోటోలను తీయడం కోసం కొంతమంది ఫోటో గ్రాఫర్లు వాళ్ల ఇంట్లోకి చొరబడ్డారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం అయ్యింది. అనుష్క శర్మ సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా ఇలాంటి పరిస్థితే ఆలియా భట్ దంపతులు ఎదుర్కొన్నారు.

Read Also:  ప్రభాస్‌తో మళ్లీ మూవీ? కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published at : 22 Feb 2023 10:31 AM (IST) Tags: Alia Bhatt Alia Bhatt privacy Secretly Photographing

సంబంధిత కథనాలు

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

Suriya Jyotika: ముంబైకి మకాం మార్చిన సూర్య, జ్యోతిక - తొలిసారి తల్లిదండ్రులను వదిలి..

Suriya Jyotika: ముంబైకి మకాం మార్చిన సూర్య, జ్యోతిక - తొలిసారి తల్లిదండ్రులను వదిలి..

18 ఏళ్లుగా అదేపని, చోరీ డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశారు - సూపర్ స్టార్ కూతురికే షాకిచ్చిన పనివారు

18 ఏళ్లుగా అదేపని, చోరీ డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశారు - సూపర్ స్టార్ కూతురికే షాకిచ్చిన పనివారు

Nithiin Rashmika New Movie : నితిన్ ఫ్లాపులు, రష్మిక కాంట్రవర్సీలు - కొత్త సినిమా కబురులో ఫుల్ సెటైర్లు

Nithiin Rashmika New Movie : నితిన్ ఫ్లాపులు, రష్మిక కాంట్రవర్సీలు - కొత్త సినిమా కబురులో ఫుల్ సెటైర్లు

Dasara: అదరగొట్టే మాస్ స్టెప్స్‌తో ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ - ‘దసరా’ ఫస్ట్ వీడియో సాంగ్ వచ్చేసింది!

Dasara: అదరగొట్టే మాస్ స్టెప్స్‌తో ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ - ‘దసరా’ ఫస్ట్ వీడియో సాంగ్ వచ్చేసింది!

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?