By: ABP Desam | Updated at : 22 Feb 2023 10:18 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Kangana Ranaut/Instagram
కంగనా రనౌత్ గురించి సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలలోనూ పని చేసింది. తెలుగు ప్రేక్షకులనూ ఆమె అలరించింది. నిత్యం హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే కంగనా, నాలుగుసార్లు జాతీయ అవార్డులను అందుకుని సత్తా చాటుకుంది. ప్రస్తుతం ‘చంద్రముఖి-2’ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. తాజాగా అభిమానులతో ట్విట్టర్ లో 'ఆస్క్ కంగనా' అనే ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది.
ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఆమెను బాహుబలి స్టార్ ప్రభాస్ తో తిరిగి సినిమా చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించాడు. కలవడం గురించి ప్రశ్నించాడు. అంతేకాదు, అతడితో ఉన్న ఓ మెమరీని పంచుకోవాలని కోరాడు. దీనికి కంగనా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. ప్రభాస్ అద్భుతమైన హోస్ట్ అని చెప్పింది. ఆయన ఇంట్లో ఫుడ్ బ్రహ్మాండంగా ఉందని చెప్పింది. కానీ ప్రభాస్ తో నటించే విషయాన్ని దాటవేసింది. ఇంతకీ తనతో నటించాలని ఉందా? లేదా? అనే ప్రశ్నకు క్లారిటీ ఇవ్వలేదు. 2009లో విడుదలైన ‘ఏక్ నిరంజన్’ చిత్రంలో ప్రభాస్‌తో కంగనా స్క్రీన్ షేర్ చేసుకుంది. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రభాస్, కంగనా నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. అయితే, పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
Prabhas home has the best food ever … and he is a wonderful host #askkangana https://t.co/gmACXcPo1d
— Kangana Ranaut (@KanganaTeam) February 20, 2023
అటు హిందీ, తమిళ సినిమా పరిశ్రమ మధ్య తేడాల గురించి అభిమానులు ప్రశ్నించారు. “హిందీ సినిమా, తమిళ సినిమాల మధ్య తేడాలు ఏంటి? దక్షిణాదిలో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు? అని ఓ నెటిజన్ అడిగాడు. ఈ ట్వీట్‌కు కంగనా సమాధానం చెప్పింది. ప్రస్తుతం తాను మూడో తమిళ చిత్రం చేస్తున్నట్లు చెప్పింది. తమిళ సినిమా పరిశ్రమలో తన పట్ల మంచి అభిమానం ఉందని చెప్పింది. అక్కడి మేకర్స్, అభిమానుల పట్ల తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. నిజానికి తాను ప్రొఫెషనల్‌గా, ప్రశాంతంగా ఉంటానని, సొంత ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని టైంపాస్ కోసం ఎవరితోనూ మాట్లాడనని వారు ఎప్పుడూ చెబుతుంటారని వెల్లడించింది. సరిగ్గా ఇవే లక్షణాలు బాలీవుడ్ జనాలకు నచ్చడం లేదని చెప్పింది. ఇలా ఉంటే తనను హిందీ పరిశ్రమలో అహంకారిగా భావిస్తున్నారని వెల్లడించింది.
This is my third Tamil film and I just love it for sheer acceptance they have for me, they tell me I am professional, calm and mind my own business, never talk to anyone for timepass it’s amusing that exactly for these qualities Bollywoodias call me arrogant and rude #askkangna https://t.co/jJynZh6IDb
— Kangana Ranaut (@KanganaTeam) February 20, 2023
ప్రస్తుతం కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. ఈ హిస్టారికల్ డ్రామాలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోంది. ఇక ఐకానిక్ హిట్ మూవీ ‘చంద్రముఖి’కి సీక్వెల్ అయిన ‘చంద్రముఖి2’లో ఆమె టైటిల్ రోల్ పోషిస్తోంది.2005లో రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో ‘చంద్రముఖి’ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పి. వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, కంగనా కలిసి నటిస్తున్నారు.
Read Also: యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్, ‘సిటాడెల్’ కోసం సమంత ఎంత కష్టపడుతుందో చూశారా!
Salman Khan Threat: సల్మాన్‌కు భద్రత కట్టుదిట్టం - జైల్లో నుంచే ప్లాన్ చేస్తున్న గ్యాంగ్‌స్టర్?
Janaki Kalaganaledu March 21st: రామని దారుణంగా అవమానించిన అఖిల్- భార్యగా బాధ్యతలు నిర్వర్తించమని జానకికి సలహా ఇచ్చిన జ్ఞానంబ
Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్
Gruhalakshmi March 21st: తులసమ్మ సేవలో నందు- విక్రమ్ ని ఇష్టపడుతున్న దివ్య, చూసేసిన భాగ్య
Brahmamudi March 21st: భార్యాభర్తలుగా కావ్య, రాజ్- రిసెప్షన్ కి మారువేషాలు వేసుకొచ్చిన కనకం, మీనాక్షి
AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి
వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం