News
News
X

The Ghost Promo: ‘ది ఘోస్ట్’ ప్రోమో: ‘థమహగానే’ సీన్‌తో నాగ్ ఎంట్రీ - అంచనాలు పెంచేస్తున్న కింగ్ మూవీ!

నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ మూవీ నుంచి ఓ ఆసక్తికరమైన సీన్‌ను ప్రోమోగా రిలీజ్ చేశారు. ఈ సీన్ చూస్తే తప్పకుండా అంచనాలు పెరిగిపోతాయి.

FOLLOW US: 

క్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తన ‘ది ఘోస్ట్’ మూవీ నుంచి ప్రోమో వచ్చేసింది. నాగ్ థమహగానే అనే విలువైన లోహంతో కత్తిని తయారు చేస్తున్న సీన్‌ను ఈ ప్రోమోలో చూపించారు. ఈ ఒక్క సీన్‌తో మూవీపై అంచనాలు మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు. 

‘‘విక్రమ్.. నువ్వు ఎక్కడున్నావో వారికి తెలిసిపోయింది. యావత్ అండర్ వరల్డ్ నీ గురించి వస్తున్నారు’’ అనే ఉమెన్ వాయిస్‌కు నాగార్జున ‘‘రానీ..’’ అని రిప్లయ్ ఇవ్వడంతో ఈ సీన్ మొదలైంది. ఆ తర్వాత నాగ్ గన్ తీయడం, అనంతరం ఒక గదిలో ఉన్న థమహగానే (విలువైన ఉక్కు) అనే బాక్సులోని ముడి లోహాన్ని తీసీ కొలిమిలో వేసి కరిగించి కత్తిని తయారు చేయడం ఆసక్తి కలిగిస్తుంది. ఆ తర్వాత ఇంటిని చుట్టుముట్టిన గ్యాంగ్‌తో ఫైట్ చేయడానికి నాగ్ రెడీ అవుతున్నట్లుగా చూపించారు. ఒకే ఒక బుల్లెట్‌తో ట్రాన్స్‌ఫర్మర్‌ను కాల్చడంతో వచ్చే నిప్పుల వెలుగుల్లో నాగ్ సీరియస్ లుక్‌ను అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. మొత్తానికి ఈ సీన్‌తో ‘ది ఘోస్ట్’ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. 

‘ది ఘోస్ట్’ థమహగానే ప్రోమో:

‘ది ఘోస్ట్’ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఇందులో నాగార్జున మాజీ ‘రా’ ఏజెంట్ పాత్రను పోషిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ చెబుతున్నారు. ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఆ ప్రచారంలో నిజం లేదని, థియేటర్లలో సినిమాను విడుదల చేస్తామని ఇటీవలే చిత్ర బృందం క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. అక్టోబర్ 5 అంటే విజయ దశమి. ఈ సినిమాతో నాగార్జున దసరా సీజన్ టార్గెట్ చేశారని అర్థమవుతుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. 35 సెకన్ల వీడియోలో నాగ్ విలన్లను ఊచకోత కోయడాన్ని చూపించారు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహన్ నటిస్తోంది. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ది ఘోస్ట్’ మూవీని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

భారీ ప్రాజెక్ట్స్‌తో వస్తున్న అక్కినేని నాగార్జున: అక్కినేని నాగార్జున ‘ది ఘోస్ట్’తోపాటు మరో భారీ బడ్జెట్ మూవీతో వస్తున్నారు. పాన్ ఇండియాగా చిత్రంగా తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రను పోషిస్తున్నారు. సినిమాలో ఆయన అనీష్ శెట్టి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో నాగార్జున నంది అస్త్రంగా కనిపించనున్నారు. నంది అస్త్రానికి చీకటి సైతం వణుకుతుందని, దానికి వెయ్యి నందులు బలం ఉంటుందని కరణ్ జోహార్ పేర్కొన్నారు. ఈ సినిమా ట్రైలర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. 

Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

Published at : 18 Aug 2022 11:33 AM (IST) Tags: nagarjuna The Ghost Promo The Ghost - Thamahagane Promo Nagarjuna The Ghost

సంబంధిత కథనాలు

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Dhanush New Song : ఒకే ఒక ఊరిలోనా, ధనుష్ ఎక్కడా 'తగ్గేదే లే'

Dhanush New Song : ఒకే ఒక ఊరిలోనా, ధనుష్ ఎక్కడా 'తగ్గేదే లే'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

టాప్ స్టోరీస్

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?