Akhanda First Single: 'అఖండ' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 'అఖండ' సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 'అఖండ' సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటిపాటను శనివారం చిత్రబృందం విడుదల చేసింది. 'అడిగా అడిగా' అంటూ సాగే ఈ మెలోడీకి థమన్ సంగీతం అందించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ చాలా కలర్ ఫుల్ గా ఉంది.
Also Read : 'విక్రమార్కుడు 2' కథ రెడీ.. మరి డైరెక్టర్ దొరుకుతాడా..?
ఎస్పీబీ వారసుడు చరణ్ ఈ పాటను పాడారు. బోయపాటి మార్క్ నిండైన చిత్రీకరణతో ఈ పాట సాగింది. పాటలో చూపించిన వీడియో క్లిప్స్ లో కానీ.. స్టిల్స్ లో కానీ బాలయ్యను చాలా అందంగా చూపించారు. బోయపాటి మాత్రం బాలయ్యను అందంగా చూపించగలరని మరోసారి నిరూపించారు. నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది మే నెలలో విడుదల చేయాలనుకున్నారు.
కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. టికెట్ రేట్లు, హండ్రెడ్ పెర్సెంట్ ఆక్యుపెన్సీ వస్తే 'అఖండ' సినిమా దసరాకు థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తొలిసారి అఘోరా గెటప్ లో కనిపించనున్నారు బాలయ్య. 'సింహా', 'లెజెండ్' వంటి సినిమాల బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలునెలకొన్నాయి. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ కనిపించనుంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Here's the magical melody #AdigaaAdigaa❤️ from #Akhanda
— Dwaraka Creations (@dwarakacreation) September 18, 2021
▶️ https://t.co/rrhNpzjIzq#AkhandaMusicalRoar🦁 #BB3
A @MusicThaman Musical🎼
✍️lyrics @kalyanlyrics#NandamuriBalakrishna #BoyapatiSreenu @ItsMePragya #MiryalaRavinderReddy @dwarakacreation @LahariMusic pic.twitter.com/zjNpj6zde1