అన్వేషించండి
Advertisement
Sri Simha: దొంగగా మారిన కీరవాణి కొడుకు.. ఫ్రెండ్ పెళ్లి కోసం మెమొరీ కార్డ్ దొంగిలించి..
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ.. 'మత్తువదలరా' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ.. 'మత్తువదలరా' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఆయన 'తెల్లవారితే గురువారం' అనే మరో సినిమాలో నటించారు. ఈ సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలు లైన్లో పెట్టారు శ్రీసింహ. ఒకటి 'భాగ్ సాలే' కాగా రెండోది 'దొంగలున్నారు జాగ్రత్త'. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న 'దొంగలున్నారు జాగ్రత్త' సినిమాను సతీష్ త్రిపుర అనే దర్శకుడు రూపొందిస్తున్నారు.
సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలవుతుంది. అయితే సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో సినిమా షూటింగ్ ను మళ్లీ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఆసక్తి వీడియోను విడుదల చేశారు. తన ప్రాణ స్నేహితుడి పెళ్లి కారణంగా ఒక్కరోజు సెలవుకి పర్మిషన్ ఇవ్వాలని శ్రీసింహ దర్శకుడిని కోరగా.. ఇవ్వడం కుదరదని.. ఆల్ ఆర్టిస్ట్స్ కాంబినేషన్ సీన్లు ఉన్నాయని డైరెక్టర్ చెబుతారు.
ఆ మాటకు శ్రీసింహ.. 'ఒక్క రెండు గంటలైనా ఇవ్వండి.. అలా వెళ్లి.. వాళ్లకు కనిపించి వచ్చేస్తా' అని అడగ్గా.. 'నో.. కావాలంటే జూమ్ కాల్ లో విషెష్ చేయండి' అని చెబుతాడు. దాంతో చేసేదేం లేక షూట్ ప్రారంభించండి లొకేషన్ లో అడుగుపెడతా.. అంటూ శ్రీసింహా అక్కడే ఉన్న కెమెరా మెమొరీ కార్డుని దొంగిలిస్తాడు. షూటింగ్ మొదలుకాగానే.. అంటూ మెమొరీ కార్డు కోసం వెతుకుతుండగా.. ఎంతసేపటికీ దొరకదు. దీంతో కొన్ని గంటలు షూటింగ్ వాయిదా వేస్తున్నామని దర్శకుడు చెబుతాడు.
'సరే సరే.. నేను నా పనులు చూసుకువస్తా.. అయినా డైరెక్టర్ గారూ.. దొంగలున్నారు జాగ్రత్త' అంటూ శ్రీసింహా సమాధానమిస్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రీతీ ఆస్రాన్ని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి రోహిత్ కులకర్ణి సంగీతం అందిస్తున్నారు.
WARNING ⚠️ - Dongalunnaru Jaagratha#DLJTheFilm Shoot Begins !
— Suresh Productions (@SureshProdns) September 18, 2021
▶️ https://t.co/sERq7KSvX7@Simhakoduri23 @thondankani #PreethiAsrani @SathishTripura @yeshhu92 @garrybh88 @gurufilms1
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement