Adivi Sesh: పెరిగిన 'మేజర్' టికెట్ రేట్స్ - రెండు గంటల్లో ఇష్యూ సాల్వ్ చేసిన అడివి శేష్
'మేజర్' సినిమా టికెట్ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. సినిమా అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని 'మేజర్' టీమ్ ప్రకటించింది.
26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' అనే సినిమాను రూపొందించారు. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇటీవల విడుదల చేసిన సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో కొన్ని చోట్ల సినిమా ప్రీరిలీజ్ ఫిల్మ్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఆ విధంగా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. అయినప్పటికీ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా టికెట్ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. సినిమా అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని 'మేజర్' టీమ్ ప్రకటించింది.
I requested #Sandhya35MM and they agreed to Rs.150. Thank you to the THEATERS for helping our efforts. We want to make #MajorTheFilm affordable to everyone! 🇮🇳 https://t.co/FYa4J9wMtL pic.twitter.com/Cqf8XEgxL0
— Adivi Sesh (@AdiviSesh) May 31, 2022
View this post on Instagram