అన్వేషించండి

Adipurush Release Date: ఆదిపురుష్ విడుదల తేదీకి ముహూర్తం ఫిక్సైంది... రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఇండిపెండెన్స్ డే కన్నా ముందే ట్రీట్..

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా విడుదల తేదీ ఫిక్సైంది. ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని ఆగష్టు 11న ఆదిపురుష్ విడుదల చేయనున్నారు. అంటే 8 నెలల్లో మూడు సినిమాలతో వస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్.

2022 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి పండుగే పండుగ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు విడుదలకానున్నాయి.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'రాధే శ్యామ్' సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఇక ప్రభాస్ తో కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్' సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఇక  ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్' నిర్మాతలు సైతం విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని ఆగష్టు 11న 'ఆదిపురుష్' విడుదల చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన చేశారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. 

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్'  షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. భారీ బడ్జెట్‏తో రూపొందుతున్న ఈ మైథాలజీ ఫిల్మ్‏లో ప్రభాస్ రాముడిగా.. కృతిసనన్ సీతగా కనిపించబోతున్నారు. ఇక రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించనున్నాడు.  లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివరి వరకు ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  

సీనియర్ హీరో కృష్ణం రాజు కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. మొదట్లో హిట్స్ అందుకున్నా ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ చూశాడు. 'మిర్చి' నుంచి తన స్టైల్ మార్చిన ప్రభాస్.. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. వచ్చేఏడాది కేవలం ఎనిమిది నెలల్లో మూడు సినిమాలతో అభిమానులు పెద్ద ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. 2022 సంక్రాంతి కానుకగా 'రాథేశ్యామ్' , సమ్మర్లో 'సలార్' విడుదలవుతుందని ప్రకటించడంతో 'ఆదిపురుష్' వచ్చేఏడాది దసరాకి వస్తుందనుకున్నారు. కానీ అంతకుముందే అంటూ ఆగస్టులో డేట్ లాక్ చేశారు మూవీ టీమ్.

Also Read: టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్‌.ఆర్‌.వెంకట్‌ కన్నుమూత, సోషల్ మీడియా ద్వారా ప్రముఖుల సంతాపం

Also Read: గులాబ్‌ తుపాను ప్రభావం...ఆంధ్రప్రదేశ్ లో కుంభవృష్టి, తెలంగాణలో మరో మూడు రోజులు దంచికొట్టనున్న వానలు..హైదరాబాద్ లో హై అలెర్ట్

Also Read: గులాబ్ తుపాన్ ఎఫెక్ట్…హైదరాబాద్ వాసులు తప్పనిసరైతే కానీ బయటకు రావొద్దు...

Also Read: గులాబ్ తుపాను ప్రభావంతో రద్దైన, దారిమళ్లించిన రైళ్ల వివరాలివే...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం
AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం
SpaceX Crew 10 Mission Success: నాసా, స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
నాసా, స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
Pushpa 3 Movie: 'పుష్ప 3' మూవీ వచ్చేది ఎప్పుడంటే? - ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పేసిన నిర్మాత రవిశంకర్
'పుష్ప 3' మూవీ వచ్చేది ఎప్పుడంటే? - ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పేసిన నిర్మాత రవిశంకర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TDP Activist Loss life in Punganur | పెద్దిరెడ్డి ఇలాకాలో బలైపోయిన మరో టీడీపీ కార్యకర్త | ABP DesamDrunk man travels beneath RTC bus | పీకల దాకా తాగి..బస్సు కింద వేలాడుతూ జర్నీ చేసిన తాగుబోతు | ABP DesamCM Revanth Reddy on KCR Life Threat | కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు | ABPPawan Kalyan vs Tamilnadu Leaders | తమిళనాడు నుంచి వస్తున్న రియాక్షన్స్ పై పవన్ సంజాయిషీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Challenges KCR: హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం
AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం
SpaceX Crew 10 Mission Success: నాసా, స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
నాసా, స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
Pushpa 3 Movie: 'పుష్ప 3' మూవీ వచ్చేది ఎప్పుడంటే? - ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పేసిన నిర్మాత రవిశంకర్
'పుష్ప 3' మూవీ వచ్చేది ఎప్పుడంటే? - ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పేసిన నిర్మాత రవిశంకర్
AR Rahman Health Update: ఆస్పత్రి నుంచి ఏఆర్ రెహమాన్ డిశ్చార్జ్ - అసలు ఆయనకు ఏం జరిగిందంటే..?
ఆస్పత్రి నుంచి ఏఆర్ రెహమాన్ డిశ్చార్జ్ - అసలు ఆయనకు ఏం జరిగిందంటే..?
స్టేషన్ ఘన్‌పూర్‌లో రూ. 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - వాటి పూర్తి వివరాలివే
స్టేషన్ ఘన్‌పూర్‌లో రూ. 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - వాటి పూర్తి వివరాలివే
Serial Actress Kavya: అరేంజెడ్ మ్యారేజ్ Vs లవ్ మ్యారేజ్ అంటే నో మ్యారేజ్ - ఆ వ్యక్తిని మైండ్‌లోంచి తీసేశానన్న బుల్లి తెర స్టార్ కావ్య
అరేంజెడ్ మ్యారేజ్ Vs లవ్ మ్యారేజ్ అంటే నో మ్యారేజ్ - ఆ వ్యక్తిని మైండ్‌లోంచి తీసేశానన్న బుల్లి తెర స్టార్ కావ్య
Secunderabad Kavach Center: సికింద్రాబాద్‌లో కవచ్ రీసెర్చ్ సెంటర్ - శంషాబాద్ ఎయిర్ పోర్టులాగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్ రెడ్డి
సికింద్రాబాద్‌లో కవచ్ రీసెర్చ్ సెంటర్ - శంషాబాద్ ఎయిర్ పోర్టులాగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్ రెడ్డి
Embed widget