By: ABP Desam | Updated at : 30 Jan 2023 10:16 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Adhire Abhi/Instagram
‘జబర్దస్త్’ కామెడీ షో గురించి తెలుగు రాష్ట్రాల బుల్లి తెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. చక్కటి కామెడీతో ఇంటిల్లిపాది ఆహ్లాందంగా నవ్వుకునేలా చేసిన షో. ఎంతో మంది మట్టిలో మాణిక్యాల్లాంటి కామెడియన్లను వెలుగులోకి తీసుకొచ్చిన షో. టాప్ రేటింగ్ తో దుమ్మురేపిన ఈ షో కాస్త ప్రస్తుతం చప్పగా మారిపోయింది. కొంత మంది కీలకమైన కమెడియన్లు వెల్లడిపోవడం, కొత్తవారు ఎంట్రీ ఇవ్వడం పంచుల్లో పస తగ్గడం, నస పెరగడం కారణంగా రోజు రోజుకు ఆదరణ తగ్గిపోతోందని టాక్.
ఈ నేపథ్యంలోనే ‘జబర్దస్త్’ కమెడియన్ అదిరే అభి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో నవ్వించిన ‘జబబర్దస్త్’ కామెడీ షోకు దిష్టి తగిలిందని చెప్పారు. ఏం జరిగిందో తెలియదు కానీ, మమ్మల్ని మేమే తిట్టుకునే పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ షోకు ఎవరి దిష్టి తగిలిందో తనకు అర్థం కావడం లేదన్నారు. మళ్లీ ప్రేక్షకులను నవ్వించే పాత రోజులు వస్తే బాగుండని అభిప్రాయపడ్డారు. జబర్దస్త్ టీం అంతా సంతోషంగా, ఓ కుటుంబం లా, మాది జబర్దస్త్ ఫ్యామిలీ అనేలా ఉండేదన్నారు. ఫ్యామిలీ లాంటి ‘జబర్దస్త్’ షోకు ఎవరో దిష్టిపెట్టారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.
“మా ‘జబర్దస్త్’ టీమ్ కు దిష్టి తగిలింది.. జబ్బలు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు, టైమింగ్‌తో పంచులేసే టీమ్ లీడర్లు, కామెడీని అవపోసన పట్టే కంటెస్టెంట్లు. అందరికీ అన్నం పెట్టే అమ్మలాంటి మల్లెమాల ఇది కదా మా కుటుంబం. కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు.స్టేజ్ ఎక్కేవరకూ రిహార్సల్స్ అయినా అప్పుడప్పుడు స్పాంటేనిటీలు. పోస్టర్ ఆఫ్ ది డే కోసం ఫోజులు, పాతికవేల చెక్కుతో ఫోటోలు, జడ్జీలు వేసే కౌంటర్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు, సలహాలు, సూచనలు. ఎవరి దిష్టి తగిలిందో, ఎవరైనా ఏదైనా అంటే పడని మేము.. మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం. సమయం వెనక్కి వెళ్తే బాగుండు, ఆరోజులు తిరిగి వస్తే బాగుండు, అందరినీ నవ్వించే ‘జబర్దస్త్’కి మళ్లీ నవ్వే రోజులు వస్తే బాగుండు- అదిరే అభి” అంటూ రాసుకొచ్చారు.
ప్రస్తుతం చాలా మంది కమెడియన్స్ ఈ షో నుంచి బయటకు వెళ్లారు. జడ్జిలుగా షోను నడిపిన రోజా, నాగబాబు సైతం ఈ షోకు దూరం అయ్యారు. రోజ ఏపీ మంత్రి కాగా, నాగబాబు కారణాలు తెలియదు కానీ, ఈ షో నుంచి వెళ్లిపోయారు. యాంకర్ అనసూయ కూడా కొంత కాలం క్రితమే షోకు గుడ్ బై చెప్పింది. సినిమాల్లో బిజీ కావడం మూలంగానే తను ఈ షో నుంచి వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు ఇప్పుడు షోలో లేరు. అదిరే అభి కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు. మరికొంత మంది ‘జబర్దస్త్’ కమెడియన్లు మల్లెమాల సంస్థపైనా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అదిరే అభి పెట్టిన పోస్టు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.
Read Also: ఔను, ఇద్దరం వెకేషన్‌కు వెళ్లాం, కానీ - విజయ్‌తో ప్రేమాయణంపై రష్మిక కామెంట్స్
Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత
Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?
Shah Rukh Khan Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!
Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్
Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?
Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి
PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్ 30 వరకు ఛాన్స్
Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!
Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?