By: ABP Desam | Updated at : 19 Apr 2023 01:27 PM (IST)
Photo@Taapsee Pannu/Instagram
తీరం దాటాక తెప్ప తగలేయండం అంటే ఏంటో హీరోయిన్ తాప్సీ పన్ను కామెంట్స్ ను చూస్తే అర్థం అవుతోంది. గతంలో ఓసారి తెలుగు సినిమా పరిశ్రమపై నోటికొచ్చినట్లు మాట్లాడిన ఈ సొట్టబుగ్గల సుందరి, తాజాగా సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్నీ తిట్టిపోసే ప్రయత్నం చేసింది. దక్షిణాదిలో ఎన్నో సినిమాలు చేసినా, తనకు ఎలాంటి గుర్తింపు రాలేదని వెల్లడించింది.
‘ఝుమ్మంది నాదం’తో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సీ. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ‘వస్తాడు నా రాజు’, ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’, ‘వీర’, ‘మొగుడు’, ‘దరువు’, ‘గుండెల్లో గోదారి’, ‘షాడో’, ‘దొంగాట’, ‘ఘాజీ’, ‘ఆనందో బ్రహ్మశ్రీ లాంటి సినిమాల్లో నటించింది. అయితే, తెలుగులో ఆమె నటించి కొన్ని సినిమాలు మినహా మిగతావి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఆమె టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్లిపోయింది. ‘ఛష్మే బద్దూర్’ చిత్రంతో హిందీ చిత్రసీమకు పరిచయం అయ్యింది. ‘పింక్’ సినిమాతో అద్భుత గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అక్కడే సెటిట్ అయ్యింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన ఆమె, తాజాగా మరోసారి నోరు పారేసుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, సౌత్ సినిమా పరిశ్రమలో నటించడం వల్ల తనకు పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు, నటిగా నిరూపించుకునే చక్కటి పాత్రలు ఏ సినిమాలోనూ దక్కలేదని వెల్లడించింది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగినా, ఒక్కటంటే ఒక్కటి కూడా సంతృప్తి కలిగించే పాత్ర దొరకలేకలేదని తెలిపింది. 10 ఏండ్ల తన హిందీ చిత్ర పరిశ్రమ ప్రయాణంలో ఎన్నో చక్కటి పాత్రలు లభించాయని వివరించింది. ‘పింక్’ సినిమా తనకెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చని వెల్లడించింది.
తాప్సీ తాజా వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. టాలీవుడ్ లో గుర్తింపు వచ్చింది కాబట్టే, బాలీవుడ్ కు వెళ్లే అవకాశం దక్కిందంటున్నారు. ఇక్కడ రాణించకపోతే, బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చేవే కాదంటున్నారు. సినీ ప్రముఖులు సైతం తాప్సీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు బడుతున్నారు. అవసరం తీరాక ఇలాంటి మాటలు మాట్లాడ్డం సరికాదంటున్నారు.
వాస్తవానికి తాప్సీ గతంలోనూ సౌత్ సినీ పరిశ్రమపై విమర్శలు చేసింది. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్స్ గానే చూస్తారని వెల్లడించింది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు తన ప్రతి సినిమాలో హీరోయిన్ ను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేస్తారని చెప్పింది. ఈ కామెంట్స్ పైనా గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది తాప్సీ. నెటిజన్లు, సినీ జనాలు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
Read Also: సెన్సార్ రిపోర్ట్: ‘విరూపాక్ష’కు A సర్టిఫికేట్ - సెకండాఫ్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందట!
రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు
హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం
Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!
Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?
అభిమానుల చేతుల మీదుగా 'భగవంత్ కేసరి' టీజర్ - ఎన్ని థియేటర్లలో తెలుసా?
Sharwanand: సీఎం కేసీఆర్ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం