అన్వేషించండి

Samantha: ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నా- విడాకులపై సమంత షాకింగ్ కామెంట్స్

నాగ చైతన్యతో విడాకులు, ఆరోగ్య సమస్యలపై సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. వాటి కారణంగానే మానసిక బలాన్ని సాధించినట్లు చెప్పింది.

Actress Samantha About Her Divorce And Health Problems: తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సమంత గత కొంతకాలంగా ఆనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతూ హెల్త్ ను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. నాగ చైతన్యతో విడాకులు, తన ఆరోగ్య సమస్యల గురించి స్పందించింది.

జీవితంలో ఎన్నో అగ్ని పరీక్షలు ఎదురయ్యాయి

నాగ చైతన్యతో విడాకులు, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మయోసైటిస్ వ్యాధి సోకడంతో సమంతా పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. తాజాగా ఇదే విషయాన్ని ఆమె ప్రస్తావించింది. ప్రతి ఒక్కరు తమ జీవితంలో కొన్ని విషయాలను సరి చేసుకోవాలని భావిస్తారని, కానీ దేవుడు అలాంటి అవకాశాన్నిఇవ్వడని అభిప్రాయపడింది. జీవితం విసిరే సవాళ్లను తప్పకుండా ఎదుర్కోవాల్సిందేనని చెప్పింది.

“మన జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనలను మార్చుకోవాలని అందరం కోరుకుంటాం. నా జీవితం గురించి కూడా అప్పుడప్పుడు ఇలాగే ఆలోచిస్తాను. నాకున్న డబ్బు, హోదాతో సంతోషంగా ఉన్నానా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. జీవితంలో మళ్లీ వెనక్కి వెళ్తే బాగుటుంది అనుకుంటాను. మూడు సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగిన ఘటన మర్చిపోలేకపోతున్నాను. అలా జరగకుండా ఉండి ఉంటే బాగుండేదని భావిస్తున్నాను. అయితే, నేను ఆ జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత గతంలో కంటే బలంగా తయారయ్యాను. మానసికంగానూ మెరుగుపడ్డాను. జీవితం మన మీదికి ఎన్నో సవాళ్లను విసురుతుంది. వాటిని ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. నేనూ నా జీవితంలో ఎన్నో అగ్ని పరీక్షలను ఎదుర్కొన్నాను. ఆధ్యాత్మికం అనేది ఎన్నో సవావాళ్లను ఎదుర్కొనేలా ధృడ సంకల్పాన్ని కలిగించింది” అని సమంత వెల్లడించింది.

అనారోగ్యంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత

ఇక సమంత 2021లో నాగ చైతన్యతో విడాకుల తర్వాత ‘శాకుంతలం’ సినిమా చేసింది. ఆ సమయంలోనే ఆమెకు మయోసైటిస్ అనే వ్యాధి సోకింది. సమంత పూర్తిగా మారిపోయింది. చాలా నీరసంగా తయారైంది. అనారోగ్యంతోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. మళ్లీ కాస్త కోలుకున్నాక, విజయ్ దేవరకొండతో కలిసి ‘కుషి’ అనే సినిమా చేసింది. ఈ చిత్రం కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. మరోవైపు రాజ్, డీకేతో కలిసి ‘సిటాడెట్’ వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ విడుదల కోసం ఆమె వేచి చూస్తోంది. మరోవైపు సమంత నిర్మాతగా ‘బంగారం’ అనే సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.  మొత్తంగా విడాకులు, ఆనారోగ్యం, ఆమె గత మూడు సినిమాలను పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సమంత బాగా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఆమె, ఈ మధ్య కాస్త తక్కువగా కనిపిస్తోంది. పూర్తిగా ఆరోగ్యం మీద కాన్సంట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్‌ కొట్టేసిన జాన్వీ కపూర్‌ - నాని సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్‌ అయినట్టేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
Embed widget