Roja MAA elections: ‘మా’ ఎన్నికలపై స్పందించిన రోజా.. వారికే నా ఓటు!
‘మా’ ఎన్నికల్లో రాజకీయాలపై నటి రోజా తొలిసారిగా స్పందించారు. ఎవరికి సపోర్ట్ చేస్తారనే ప్రశ్నకు ఆమె ఇలా బదులిచ్చారు.
![Roja MAA elections: ‘మా’ ఎన్నికలపై స్పందించిన రోజా.. వారికే నా ఓటు! Actress Roja Comments on MAA elections Roja MAA elections: ‘మా’ ఎన్నికలపై స్పందించిన రోజా.. వారికే నా ఓటు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/83539efb43f5c1cfa088326d4b0af3ed_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు వాడీవేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతోపాటు వారి ప్యానల్‌లో ఉన్న సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ.. ఎన్నడూ లేని విధంగా వీధిన పడ్డారు. పరస్పర ఆరోపణలతో రాజకీయ నేతల్లా తిట్టుకొనే స్థాయికి దిగజారాయి ‘మా’ ఎన్నికలు. ఈ నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ నెలకొంది.
ఈ గొడవలపై తారలు కూడా ఆచీతూచి స్పందిస్తున్నారు. కొందరు బాహాటంగా తమ మద్దతు వారికేనంటూ ప్రకటించినా.. మరికొందరు మాత్రం తమ ఓటు ఎవరికనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. తాజాగా నటి, ఎమ్మెల్యే రోజా సైతం.. ‘మా’ ఎన్నికలపై స్పందిస్తూ.. ఈ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికల్లా వాడీ వేడిగా ఉన్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో వేలు పెట్టాలనుకోవడం లేదని, అందులో సభ్యురాలిగా తన ఓటు హక్కును మాత్రం సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నారు.
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర
ఎవరికి ఓటేస్తారనే ప్రశ్నకు రోజా బదులిస్తూ.. రెండు ప్యానళ్లు ఇచ్చిన మేనిఫేస్టోలో ఏది ఉపయోగం ఉంటుందో వారికే ఓటేస్తానని రోజా తెలిపారు. ప్రస్తుతం లోకల్-నాన్ లోకల్ వివాదం కూడా ‘మా’ ఎన్నికల్లో నడుస్తోందని, దీనిపై మీ స్పందన ఏమిటనే ప్రశ్నకు రోజా బదులిస్తూ.. వివాదస్పద అంశాలపై తాను మాట్లాడబోనని తెలిపారు.
కోటాను సత్కరించిన మంచు ప్యానల్: మంచు విష్ణు ప్యానల్ సభ్యులు సీనియర్ నటీనటుల మద్దతు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్‌ను మా సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో మా అబ్బాయి మంచు విష్ణు పోటీ చేస్తున్నాడని, అతడికి ఓటేసి గెలిపించాలని మోహన్ బాబు కోరారు. కోటా స్పందిస్తూ.. ‘‘విష్ణుకు ఓటేయాలని మీరు అడగాల్సిన అవసరం లేదు. అధ్యక్షుడయ్యే అర్హత అతడికి ఉంది. కానీ, నేను ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. అతడితో నేను 15 సినిమాలు చేశాను. ఆయన ఏ సినిమాకీ ఒక్క రోజు కూడా సమయానికి రాలేదు. కాబట్టి మనం కొంచెం ఆలోచించి ఓటేయాలి. లోకల్-నాన్ లోకల్ అనే విషయాన్ని పక్కన పెడితే.. విష్ణుకు ఓటేసి గెలిపించండి’’ అని కోటా అన్నారు.
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)