By: ABP Desam | Updated at : 19 Jan 2023 10:44 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Rashmika Mandanna/Instagram
రష్మిక మందన్న.. ఈమె గురించి ప్రస్తుతం పెద్దగా పరిచయం అవసరం లేదు. నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని సినిమా పరిశ్రమల్లో సత్తా చాటుతోంది. ‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి ‘వారిసు’ సినిమాలో నటించింది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక.. ‘కాంతార’ దర్శకుడు రిషబ్ శెట్టిపై పాజిటివ్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
కొద్ది వారాల క్రితం కన్నడలో ఘన విజయం సాధించిన ‘కాంతార’ మూవీపై రష్మిక స్పందించిన తీరు తీవ్ర దుమారం రేపాయి. ఆ సినిమా చూసే తీరిక తనకు లేదని చెప్పడంతో పాటు కన్నడ సినిమా పరిశ్రమను తక్కువ చేసిన మాట్లాడినట్లు విమర్శలు వచ్చాయి. తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి గురించి తక్కువ చేసిన మాట్లాడటంపై కన్నడ సినీ లవర్స్ ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కు దిగారు. వారితో సినిమా చేయడం వల్లే ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నావంటూ మండిపడ్డారు. రిషబ్ శెట్టి కూడా ఆమెపై విమర్శలు చేశారు. ఒకానొక సమయంలో రష్మికను కన్నడ సినిమా పరిశ్రమ నుంచి బ్యాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆమె తాజాగా నటించిన ‘వారిసు’ సినిమా కూడా విడుదలైన మరుసటి రోజునే ప్రదర్శనలు సగానికి పైగా పడిపోయాయి.
ఈ నేపథ్యంలోనే రష్మిక తన తీరు మార్చుకుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి గురించి పాజిటివ్ కామెంట్స్ చేసింది. ‘కిరాక్ పార్టీ’ అనే సినిమా ద్వారా తనను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వాళ్లేనని చెప్పింది. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నానంటే వారి చలవేనని వెల్లడించింది. వారిద్దరి మూలంగానే సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తున్నట్లు చెప్పింది. మొత్తంగా రిషబ్ శెట్టితో వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు రష్మిక పాజిటివ్ వైఖరి చూపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘పుష్ప-2’ సినిమాలో నటిస్తోంది.
Read Also: ‘RRR’కు మరో ప్రతిష్టాత్మక అవార్డు - ఈసారి ఏ కేటగిరికి వచ్చిందో తెలుసా?
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?
K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్
రాతిలోని శిల్పాన్ని గుర్తించగల మహా శిల్పి విశ్వనాథ్ - ఆయన సినిమాల్లో ఈ విషయాలను గుర్తించారా?
Krishna Tribunal : కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై వీడని సందిగ్ధత, అభిప్రాయం చెప్పేందుకు ఏజీ నిరాకరణ
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !
YS Sharmila : మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీలు బంద్- వైఎస్ షర్మిల