Seattle Critics Award: ‘RRR’కు మరో ప్రతిష్టాత్మక అవార్డు - ఈసారి ఏ కేటగిరికి వచ్చిందో తెలుసా?
‘RRR’కు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈసారి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలో పురస్కారాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ తో పాటు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు అందుకుంది.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘RRR’ మూవీ అంతర్జాతీయ అవార్డుల వేదికపై సత్తా చాటుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోగ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రానికి తాజాగా మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు దక్కింది. సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ(SFCS) అవార్డును దక్కించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో మరోసారి భారతీయ సినిమా సత్తా చాటింది.
‘RRR’కు సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు
ఇప్పటి వరకు ‘RRR’ సినిమాకు సంబంధించి ఉత్తమ పాట, ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో అవార్డులు దక్కాయి. కానీ, ఈసారి సరికొత్త కేటగిరీలో ఈ చిత్రం అవార్డును పొందింది. సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ జ్యూరీ మెంబర్స్ ఈ సినిమాకు అత్యుత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలో అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు క్రియేట్ చేసిన సినిమా యూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తారు. విక్కీ అరోరా, ఇవాన్ కోస్టాడినోవ్, నిక్ పావెలో, రాయిచో వాసిలేవ్‌లు స్టంట్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు.
The @SeattleCritics 2022 award for BEST ACTION CHOREOGRAPHY:
— Seattle Film Critics (@seattlecritics) January 17, 2023
** RRR **#RRR | @RRRMovie (@netflix) | @SSRajamouli | @DVVMovies#SFCS #SFCSAwards2022 #BestActionChoreography pic.twitter.com/GoFf1AWnVf
ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన ‘RRR’
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామ రాజు, కొమురం భీమ్ పాత్రలు పోటించారు. పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. రూ.500 కోట్లతో రూపొందిన ఈ మూవీ, ఏకంగా రూ.1200 కోట్లు సాధించింది. ఇప్పటికీ జపాన్, అమెరికాలో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. విడుదలైన అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ వస్తోంది.
‘RRR’పై హాలీవుడ్ దర్శకుల ప్రశంసలు
View this post on Instagram
ఈ సినిమాపై హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ ‘RRR’ అద్భుతం అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. సైతం ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ అవార్డులపై ఫోకస్ పెట్టింది. ఆస్కార్ 2023లో ఈ చిత్రం మొత్తం 14 కేటగిరీలకు దరఖాస్తు చేసుకుంది. జనవరి 24న ఆస్కార్ అవార్డుల ప్రకటన ఉండబోతోంది. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఈ చిత్రం తప్పకుండా ఆస్కార్ ను సాధిస్తుందని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.
Read Also: ఓ మై గాడ్ - ‘వాల్తేరు వీరయ్య’ కోసం చిరంజీవి, రవితేజ అంత రెమ్యునరేషన్ తీసుకున్నారా?