అన్వేషించండి

Actress Meena: డబ్బు కోసం మరీ ఇంత దిగజారుతారా? రెండో పెళ్లిపై మీనా సంచలన వ్యాఖ్యలు

రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై సీనియర్ నటి మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాతో పాటు మీడియా రోజు రోజుకు మరింత దిగజారిపోతుందని మండిపడ్డారు.

Actress Meena On Second Marriage: మీనా... ఒప్పుడు తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. 90వ దశకంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె... రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్ సహా పలువురు అగ్ర హీరోలతో నటించారు. అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న రోజుల్లోనే 2009లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.  

అనారోగ్యంతో మీనా భర్త  విద్యాసాగర్‌ మృతి

జూన్ 2022లో మీనా భర్త విద్యాసాగర్‌ అనారోగ్యం కారణంగా మరణించారు. దీంతో మానసికంగా కుంగిపోయింది. కొంత కాలం తర్వాత కాస్త కొలుకుని పలు సినిమాల్లో నటించడానికి కూడా ఓకే చెప్పింది.  మీనా భర్త చనిపోయినప్పటి నుంచి  సోషల్ మీడియాలో బోలెడు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె రెండో పెళ్లికి సిద్దమవుతోంది అంటూ ఊహాగానాలు వస్తున్నాయి. మీనాకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఆమె, కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకోవాలి అని మీనాను ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారంటూ కథనాలు వచ్చాయి. 

మీనా రెండో పెళ్లిపై మీడియాలో ఊహాగానాలు

మీనా భర్త చనిపోయిన తర్వాత సోషల్‌ మీడియాలో ఆమెపై బోలెడు పుకార్ల వ్యాప్తి జరుగుతోంది. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఆమె పలుమార్లు రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా ఆమెపై సోషల్‌ మీడియా దాడి తగ్గడం లేదు. కొద్ది రోజుల క్రితం భార్యతో విడాకులు తీసుకున్న ధనుష్ మీనాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఈ వార్తలు తమిళ నాట బాగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వార్తలు చూసి తన ఫ్యామిలీ చాలా బాధపడుతుందని మీనా చాలా సార్లు చెప్పింది. అయినా, మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాతో పాటు మీడియాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  

డబ్బు కోసం మరీ ఇంత దిగజారుతారా?

కొంత మంది పనీపాటా లేని వాళ్లు సోషల్ మీడియాలో పుకార్లను ప్రచారం చేస్తున్నారని మీనా మండిపడ్డారు. “డబ్బు కోసం కొంత మంది ఎంతకైనా దిగజారడానికి వెనుకాడటం లేదు. సోషల్ మీడియాతో పాటు మీడియా కూడా రోజు రోజు దిగజారిపోతోంది. వాస్తవాలు తెలుసుకోకుండా, ఏది నచ్చితే అది రాసేస్తున్నారు. నిజాలు తెలుసుకుని వార్తలు రాస్తే మంచిది. దేశంలో నా మాదిరిగా ఒంటరిగా జీవించే మహిళలలు ఎంతో మంది ఉన్నారు. మీరు నా గురించి ఎలా అనుకుంటున్నారో? వారి గురించి గురించి కూడా ఇలాగే ఆలోచిస్తారు. మా కుటుంబ సభ్యులు, పిల్లలు ఈ వార్తలు చూసి బాధ పడుతారేమోనని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించి రాస్తే మంచిది. ప్రస్తుతం నేను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేయడం లేదు. భవిష్యత్తులో ఆ ఆలోచన ఉంటే తప్పకుండా అందరికీ చెప్తాను. అప్పటి వరకు ఎలాంటి పుకార్లు రాయకండి” అని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం మీనా సినిమాలతో పాటు బుల్లితెరపై జడ్జిగా చేస్తోంది.

Read Also: అక్కడ రాజు, ఇక్కడ బానిస- ‘ది గోట్ లైఫ్’ గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget