అన్వేషించండి
Advertisement
Samantha Chaitanya Divorce: ''కోట్లలో సంపాదించే సమంతకు పాకెట్‌మనీ మాత్రమే ఇచ్చేవారు..''
సమంత-నాగచైతన్య విడిపోవడంపై సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్లపై తాజాగా నటి మాధవీలత స్పందించారు.
అక్కినేని నాగచైతన్య, సమంతలు విడిపోవడంపై రకరకాల అభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. ఈ విషయంలో కొందరు సమంతను సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం నాగచైతన్యను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు వీరి విడాకులపై స్పందించారు. తాజాగా నటి మాధవీలత.. చై-సామ్ డివోర్స్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ లైవ్ లో పాల్గొన్న మాధవీలతా తన మనసులో మాటను వెల్లడించింది.
Also Read: సమంతకు భరణం ఇస్తున్నారా..? అసలు నిజాలివే!
సమంత చాలా అంటే చాలా మంది అమ్మాయని.. విడాకులకు కారణం సమంతే అంటూ చాలా మంది తనపై కామెంట్స్ చేస్తున్నారని.. అది తప్పంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గ్లామర్ దుస్తులు ధరించడం వలనే సమంతకు చైతన్య విడాకులు ఇచ్చారనడంతో నిజం లేదని అన్నారు. తెరపై కనిపించే దుస్తులకి, దంపతుల సంసారానికి ఏమాత్రం సంబంధం ఉండదని స్పష్టం చేశారు. సమంత డబ్బు మనిషి కాదని అన్నారు. సమంతను డబ్బు కోసం వాడుకోవడానికి గతంలో ఓ హీరో ట్రాప్ చేశాడని.. నిజం తెలుసుకొని ఆమె దూరంగా జరిగిందని చెప్పుకొచ్చింది.
అలానే పెళ్లైన తరువాత ఇంట్లో వాళ్ల అనుమతితోనే సమంత సినిమాల్లో నటించిందని.. గ్లామర్ రోల్స్ చేసిందని చెప్పింది. పెళ్లి, కుటుంబం, పిల్లలు ఇలా ప్రతి విషయంపై ఆమెకి ఎంతో నమ్మకం ఉందని తెలిపింది. ఆమె ఎంత మంచి మనిషి అంటే.. షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్లినప్పుడు వచ్చే డబ్బుని నేరుగా ప్రత్యూష ఫౌండేషన్ అకౌంట్ లో వేయిస్తుందని.. ఆ డబ్బుతో జబ్బులతో బాధపడే చిన్నపిల్లలకు ఆపరేషన్స్ చేయిస్తుంటుందని చెప్పుకొచ్చింది. అందరికీ తెలియని మరో విషయం ఏంటంటే.. నటిగా ఆమెకి రెమ్యునరేషన్ కోట్లలో వచ్చినా.. ఆమెకి పాకెట్ మనీ మాత్రమే ఇచ్చేవారని.. ఆమెను డబ్బులు సంపాదించే మెషీన్ లానే చూశారని.. ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడంతో ఆమె చివరికి విడిపోవడానికి సిద్ధమైందని చెప్పుకొచ్చింది.
Also Read: బ్రేకప్‌లకు కేరాఫ్ అడ్రస్.. అక్కినేని ఫ్యామిలీ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆట
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion