News
News
X

Madhavi Latha: క్యాన్సర్ పేషంట్స్ కోసం మాధవీలత ఏం చేసిందో చూశారా..?

మాధవీలతా చేసిన పనికి నెటిజన్లంతా మెచ్చుకుంటున్నారు. ఇటీవల తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఈ బ్యూటీ.. అదేరోజున ఓ క్యాన్సర్ పేషెంట్ కోసం తన జుట్టుని డొనేట్ చేసింది.

FOLLOW US: 
Share:

ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన నటి మాధవీలత ఆ తరువాత కాలంలో జోరు తగ్గించింది. ఇండస్ట్రీలో కాంపిటిషన్ పెరగడంతో ఆమెకి నటిగా అవకాశాలు తగ్గాయి. దీంతో కొన్నాళ్లు సైలెంట్ అయిపోయిన ఈ బ్యూటీ ఆ తరువాత రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకుంది కానీ వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం ఒకట్రెండు ప్రాజెక్ట్స్ ఏవో చేస్తుంది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సినీ, రాజకీయ అంశాలపై స్పందిస్తుంది. 

Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్న విభేదాలు

రీసెంట్ గా సమంత-నాగచైతన్యల డివోర్స్ విషయంపై స్పందించింది. సమంత చాలా మంచిదని.. డబ్బుకోసం ఆమెని అందరూ వాడుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేసింది. గత ఓ హీరో ఆమెని ట్రాప్ చేసి డబ్బు కోసం వాడుకున్నాడని.. దీంతో అతడికి దూరమైందని చెప్పుకొచ్చింది. పెళ్లైన తరువాత ఆమెని డబ్బు సంపాదించే మెషీన్ లానే చూశారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోట్లు సంపాదించే సమంతకు కేవలం పాకెట్ మనీ మాత్రమే ఇచ్చేవారని.. ఈ విషయం చాలా మందికి తెలియదని చెప్పుకొచ్చింది. 

ఈ విషయాలను పక్కన పెడితే మాధవీలతా చేసిన పనికి నెటిజన్లంతా మెచ్చుకుంటున్నారు. ఇటీవల తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఈ బ్యూటీ.. అదేరోజున ఓ క్యాన్సర్ పేషెంట్ కోసం తన జుట్టుని డొనేట్ చేసింది. కీమో థెరపీ కారణంగా చాలా మంది క్యాన్సర్ పేషంట్స్ తమ జుట్టుని కోల్పోతున్నారని.. హెయిర్ స్టైలిస్ట్ శివ డోనర్స్ నుంచి జుట్టుని కలెక్ట్ చేసి క్యాన్సర్ పేషంట్స్ కోసం విగ్స్ రెడీ చేస్తుంటారని చెప్పింది. తను చేయగలిగే చిన్నసాయమని చెప్పింది. ఈ విషయాన్ని జనాలతో షేర్ చేసుకోవడం ద్వారా మరింత మంది స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. క్యాన్సర్ పేషంట్స్ కి సాయం అందించడానికి మరింత మంది ముందుకు రావాలని కోరింది. 

Also Read: ''కోట్లలో సంపాదించే సమంతకు పాకెట్‌మనీ మాత్రమే ఇచ్చేవారు..''

Also Read: ‘మా’ ఎన్నికలు.. దీనికి కూడా బయట వాళ్లు ఎందుకు? దర్శకుడు రవిబాబు కీలక వ్యాఖ్యలు

Also Read: రెహమాన్ 'బతుకమ్మ' సాంగ్.. లాంచ్ చేసిన కల్వకుంట్ల కవిత

Also Read: 'మా' ఎలెక్షన్స్.. ఎన్టీఆర్ ఇలా బుక్కైపోయాడేంటి..?

Also Read: "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?

Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Oct 2021 09:48 PM (IST) Tags: Cancer Patients Actress Madhavi Latha Madhavi Latha chemo therapy

సంబంధిత కథనాలు

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!

‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?