Laya on Balakrishna: కాలు తొక్కగానే ప్యాకప్ చెప్పారు, బాలకృష్ణ గురించి నటి లయ ఆసక్తికర వ్యాఖ్యలు!
సీనియర్ నటి లయ బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ పాట షూటింగ్ లో ఆయన కాలు తొక్కగానే కోపంతో ప్యాకప్ చెప్పారన్నారు. షూటింగ్ క్యాన్సిల్ అవుతుందని చాలా ఏడ్చినట్లు వెల్లడించారు.
లయ.. తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగిన హీరోయిన్. అచ్చ తెలుగు అమ్మాయి అయిన లయ ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఫ్యామిలీతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. తాజాగా ఇండియాకు వచ్చిన ఆమె ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. తన కెరీర్ కు సంబంధించి చాలా విషయాల గురించి వివరించింది. అదే సమయంలో బాలయ్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
బాలయ్య గురించి బయట ఉన్న ప్రచారం తప్పు - లయ
నందమూరి బాలయ్యతో కలిసి 'విజయేంద్ర వర్మ' సినిమా చేసినట్లు లయ చెప్పింది. ఆ సినిమాకు ముందు ఆయనకి చాలా కోపం ఎక్కువనీ , చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అంతా చెప్పడంతో తనకు భయం ఇంకా ఎక్కువైందని తెలిపింది. కానీ, అవన్నీ వాస్తవం కాదని ఆ తర్వాత తెలిసిందని పేర్కొంది. “బాలకృష్ణను దూరం నుంచి చూసిన వాళ్లు, ఆయన చాలా కోపంగా ఉంటారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయనకు బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి. లేకపోతే కోపం వస్తుంది అనుకుంటారు. వీలైనంత వరకు ఆయనకు దూరంగా ఉండాలి అనుకుంటారు. ఆయనను నేను సర్ అని పిలిచేద్దాన్ని. కానీ, తను ఎందుకు సర్ అంటారు? బాలయ్య అను అంటారు. కానీ అలా అనలేము. బాలయ్య సర్ అనేది. బయట నుంచి తన గురించి అనుకునే దానికంటే పూర్తి భిన్నంగా ఉంటారు. ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. ఆయన బిజీగా ఉంటే మాట్లాడరు. ఆయన మాట్లాడితే చాలా బాగుంటుంది. మనసుల్లో ఉన్నదే బయటకు చెప్తారు. సెట్ లో ఉన్న అందరితో చాలా బాగుంటారు. ఆయనతో సినిమా అనగానే చాలా మంది భయపడతారు. కానీ, అదంతా అవాస్తవం” అని చెప్పారు.
కాలు తొక్కగానే కోపంతో ప్యాకప్ చెప్పారు - లయ
“‘విజయేంద్ర వర్మ’ సినిమాకు సంబంధించి తొలుత నేను ఆయనతో పాట చేశాను. తొలుత పాటకు సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నా. నేను ముందుకు తిరిగి ఉన్నాను. బాలయ్య వెనుకాల ఉన్నారు. నాకు కనిపించలేదు. స్టెప్స్ నేర్చుకుంటూ నేను కాలు వెనక్కి పెట్టాను. నా కాలుతో ఆయన కాలు మీద తొక్కాను. సారీ సర్, సారీ సర్ అన్నాను. తొక్కేస్తావా నా కాలు? అని అటు ఇటు చూసి ప్యాకప్ అన్నారు. నేను కోపంతో అలా అన్నారు అనుకుని ఏడుస్తున్నాను. సారీ సర్, సారీ సర్ అంటూ ఏడుస్తూనే ఉన్నాను. కాసేపు ఏడిపించి ఇదంతా సరదా. ఊరికే అన్నాను అంటూ నవ్వేశారు. చాలా టెన్షన్ పడ్డాను. కానీ, తను నవ్వడంతో హ్యాపీగా ఫీలయ్యాను” అని లయ వెల్లడించారు. డ్యాన్స్ విషయంలో తనతో సమానంగా చేయకపోయినా, నా కంటే బాగా చేస్తున్నావు అనేవారు. ఆయన పక్కన కూర్చుని మాట్లాడితే ఎన్టీఆర్ ను చూసినట్టు ఉండేది’’ అని లయ తెలిపింది.
Read Also: ఎన్టీఆర్‌ను మంచు లక్ష్మితో పోల్చకండి - ‘ఆంటీ’ అనడం తప్పే: నటి కస్తూరి