Kamya Punjabi: పానీపూరి తింటూ రూ.లక్ష మర్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ!
'కోయి మిల్ గయా', 'కహో నా ప్యార్ హై' వంటి సినిమాల్లో నటించిన కామ్యా పంజాబీ ఇటీవల ఆమె ఇండోర్ కి వెళ్లింది
స్ట్రీట్ ఫుడ్ లో పానీపూరి అంటే చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా అమ్మాయిలు తెగ తింటూ ఉంటారు. సెలబ్రిటీల్లో కూడా చాలా మందికి పానీపూరి ఫేవరెట్ ఫుడ్. ఓ నటి అయితే పానీపూరి తింటూ లక్ష రూపాయలను అక్కడే మర్చిపోయి వచ్చింది. ఆ నటి మరెవరో కాదు.. 'కోయి మిల్ గయా', 'కహో నా ప్యార్ హై' వంటి సినిమాల్లో నటించిన కామ్యా పంజాబీ. ఇటీవల ఆమె ఇండోర్ కి వెళ్లింది. ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి అక్కడకు వెళ్లింది.
ఈవెంట్ అనంతరం బయటకు వెళ్లి పానీపూరి తింది. పానీపూరిలు ఆస్వాదిస్తూ అక్కడ టేబుల్ పై రూ.లక్ష ఉన్న ఎన్వలప్ కవర్ ను పెట్టింది. తరువాత అక్కడ ఫొటోలు తీసుకుంటూ ఆ ఎన్వలప్ కవర్ ను అక్కడే మర్చిపోయి హోటల్ కి తిరిగి వెళ్లింది. హోటల్ కి వెళ్లిన కాసేపటికి ఎన్వలప్ మర్చిపోయిందనే సంగతి గుర్తుకురావడంతో వెంటనే తన మేనేజర్ ను అక్కడకు పంపించిందట.
తాను మర్చిపోయిన చోటుకి వెళ్లిన కామ్య మేనేజర్ కి ఆ ఎన్వలప్ దొరికింది. దీంతో దాన్ని తిరిగి తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని వెల్లడించిన కామ్య.. ఎన్వలప్ మర్చిపోయిన సమయంలో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు చెప్పింది. ఆ డబ్బు దొరకదని అనుకున్నానని.. అంత రద్దీ ఏరియాలో విలువైన ఎన్వలప్ దొరకడం ఆశ్చర్యంగా ఉందని చెప్పింది. ఇండోర్ ప్రజలు చాలా మంచివారు, దయగలవారు అని చెప్పుకొచ్చింది. ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. ఎక్కువగా హిందీ సీరియల్స్ లో నటించింది. అలానే బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఆ తరువాత పలు బిగ్ బాస్ సీజన్లలో గెస్ట్ గా పాల్గొంది.
Also Read: కోటి రూపాయలు ఆఫర్ చేసినా పెళ్లిలో పాడలేదు - అదీ సింగర్ కేకే కమిట్మెంట్
Also Read: పెళ్లి చేసుకోబోతున్న పూర్ణ - ఆమెకు కాబోయే భర్త ఎవరంటే?
View this post on Instagram
View this post on Instagram