Kajal Agrawal: భర్తపై కాజల్ ఎమోషనల్ కామెంట్స్, సెలబ్రిటీల రియాక్షన్
తాజాగా కాజల్ తన భర్త గౌతమ్ ను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన ప్రెగ్నెన్సీ సమయంలో గౌతమ్ భర్తగా ఎంత బాధ్యతగా వ్యవహరించారో వివరించింది కాజల్.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేసినప్పటి నుంచి పలు వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. ఆమె బేబీ బంప్ ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. తాజాగా కాజల్ తన భర్త గౌతమ్ ను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన ప్రెగ్నెన్సీ సమయంలో గౌతమ్ భర్తగా ఎంత బాధ్యతగా వ్యవహరించారో వివరించింది కాజల్.
ఇంతకీ ఆమె ఏం రాసిందంటే.. 'డియర్ హస్బెండ్.. మీరు ఓ మంచి భర్తగా ఉండడమే కాదు.. ప్రతీ అమ్మాయి కోరుకునే గొప్ప తండ్రి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో నాకు సపోర్టివ్ గా ఉన్నందుకు థాంక్స్. చాలా రోజుల పాటు నాతో మెలకువగా ఉండి.. మార్నింగ్ సిక్‌నెస్‌లో కూడా ఎలాంటి విసుగు లేకుండా నన్ను కంఫర్ట్ గా చూసుకున్నావు. నేను ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు అందించావు' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది.
అలానే గౌతమ్ ఎంత గొప్ప తండ్రో తెలియజేస్తూ.. 'గత ఎనిమిది నెలలుగా నీలో గొప్ప తండ్రిని చూస్తున్నానని. పుట్టబోయే బిడ్డను నువ్ ఎంత ప్రేమిస్తున్నావో.. అప్పుడే ఆ బిడ్డ సంరక్షణ కోసం నువ్ ఏం చేయాలో అది చేశావ్.. ఇలా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. పరిమితులు లేని తండ్రి ప్రేమను మన బిడ్డ పొందబోతున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చింది.
త్వరలోనే తమ జీవితాల్లో మార్పులు రాబోతున్నాయని.. సినిమాలు, షికార్లకు వెళ్లలేమని.. పార్టీలకు దూరమవుతామని.. అయినప్పటికీ చాలా సంతోషంగా ఉందంటూ ఎమోషనల్ అయింది కాజల్. వీటన్నింటికీ దూరమైనా మన బిడ్డతో విలువైన సమయాన్ని గడుపుతాం అంటూ గౌతమ్ కి ఐలవ్యూ చెప్పింది. ఈ పోస్ట్ చూసిన చాలా మంది సెలబ్రిటీలు కాజల్ ని విష్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫీలింగ్స్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మంచు లక్ష్మి కామెంట్ చేసింది.
Also Read: 'కేజీయఫ్ 2' సినిమా రివ్యూ: నో డౌట్ - బొమ్మ బ్లాక్‌బస్టర్, యశ్ అదుర్స్ అంతే!
Also Read: తప్పు చేశా, రెండు సార్లు జైల్లో పెట్టారు - అజయ్ దేవగన్ వ్యాఖ్యలు
View this post on Instagram