Appudo Ippudo Eppudo: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అంటున్న నిఖిల్ - దీపావళికి థియేటర్లలో బ్లాక్‌బస్టర్ కాంబినేషన్!
Nikhil Next Movie: పాన్ ఇండియా హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాను చేస్తున్నారు.
Appudo Ippudo Eppudo First Look: ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా లెవల్‌లో మంచి పేరు తెచ్చుకున్న హీరో నిఖిల్. ప్రస్తుతం ‘స్వయంభు’, ‘ది ఇండియా హౌజ్’ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కానీ ఈ మధ్యలో సుధీర్ వర్మ దర్శకత్వంలో సైలెంట్‌గా ఒక సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమాను ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సూపర్ హిట్ కాంబినేషన్‌లో...
సుధీర్ వర్మ, నిఖిల్‌లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో తెరకెక్కిన మొదటి సినిమా ‘స్వామి రారా’ నిఖిల్ కెరీర్‌నే మలుపు తిప్పిన సినిమా. ఈ సినిమాతో నిఖిల్ ఆడియన్స్‌లో చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. తర్వాత వీరిద్దరూ ‘కేశవ’ అనే సినిమా తీశారు. అది డీసెంట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: 'దేవర 2'లో ఆ రెండూ... లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ లీక్ చేసిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్!
రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో...
ఈ సినిమా రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో జరగనుందని గతంలో వార్తలు వచ్చాయి. యూరోప్ నేపథ్యంలో జరిగే రేసింగ్ సినిమా అని తెలుస్తోంది. సినిమా టైటిల్ లోగోను చూస్తేనే అది తెలుస్తోంది. కారు, స్పీడోమీటర్ వీటిని లోగోలో చూడవచ్చు. కానీ సినిమాకు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అని ఒక సాఫ్ట్ టైటిల్ పెట్టారు. దీంతోపాటు ఫస్ట్ లుక్ కూడా హీరో, హీరోయిన్ నడుచుకుంటూ వెళ్లే పోస్టర్ రిలీజ్ చేశారు. దీపావళికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కచ్చితమైన రిలీజ్ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు.
రుక్మిణి వసంత్ మొదటి సినిమా...
ఈ సినిమాతో కన్నడ భామ రుక్మిణి వసంత్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో రుక్మిణి వసంత్ తెలుగు ఆడియన్స్‌తో కూడా బాగా నోటెడ్ అయిపోయారు. హీరోయిన్‌గా తెలుగులో ఇదే రుక్మిణికి మొదటి సినిమా.
ఈ సినిమాకు రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం వహిస్తున్నారు. కార్తీక్ బాణీలు అందిస్తుండగా... బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం కార్తికేయ, కేశవ ఫేమ్ సన్నీ ఎంఆర్ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. ఫణి కే.వర్మ, నరసబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు ప్రారంభం కావాల్సి ఉంది. రిలీజ్‌కు ఎక్కువ సమయం లేదు కాబట్టి దసరా నుంచి జోరుగా ప్రమోషన్లు చేస్తారేమో చూడాలి మరి!
Also Read: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
This Diwali, Get ready for an Entertainer of all sorts 🥁💥
— SVCC (@SVCCofficial) October 6, 2024
Here's the TITLE & FIRST LOOK of @actor_Nikhil's next #AppudoIppudoEppudo 🥳@sudheerkvarma @rukminitweets @divyanshak @harshachemudu @dvlns @BvsnP @SunnyMROfficial @singer_karthik @NavinNooli @SVCCofficial pic.twitter.com/dVglFIgjSS