అన్వేషించండి

Devara 2 Leaks: 'దేవర 2'లో ఆ రెండూ... లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ లీక్ చేసిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్!

Jr NTR On Devara 2: 'దేవర పార్ట్ 1' విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో బోలెడు ప్రశ్నలు తలెత్తాయి. అవి చాలవన్నట్లు 'దేవర పార్ట్ 2' మీద మరింత ఆసక్తి పెంచేలా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెండు లీక్స్ ఇచ్చారు.

'దేవర' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR). ఈ సినిమా సాధించిన విజయం పట్ల ఆయనతో పాటు అభిమానులు సంతోషంగా ఉన్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయోత్సాహంతో సుమ కనకాల (Suma Kanakala)కు ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో 'దేవర 2' (Devara Part 2) గురించి చెప్పిన రెండు విషయాలు లీక్స్ అని చెప్పాలి. 

బాగుంటుంది... కానీ, అది ఇప్పుడే చెప్పను!
దర్శకుడు కొరటాల శివ ఇప్పటివరకు తీసిన సినిమాలతో పోలిస్తే... 'దేవర పార్ట్ 1'లో యాక్షన్ పార్ట్ ఎక్కువ. ఆ యాక్షన్ పొయెటిక్ గా ఉండడం వల్ల ప్రేక్షకులు అందరికీ నచ్చిందని ఎన్టీఆర్ అన్నారు. అయితే... దర్శకుడిగా తనకు ఎన్టీఆర్ నటనలోని ఎమోషన్ ఇష్టమని, ఆయన డైలాగులు చెప్పే సమయంలో ఇచ్చే పాజ్ ఇష్టమని కొరటాల శివ తెలిపారు. 

కోస్ట్ గార్డులను ఎర్ర సముద్రం ప్రజలు చంపే సమయంలో దేవర ఎదురు తిరిగిన సన్నివేశం గురించి సుమ కనకాల ప్రస్తావించగా... ''దేశానికి ఎంతో సేవ చేసిన వీరుల కుటుంబాలలో జన్మించిన తాము స్మగ్లింగ్ చేయడం దేవరకు ఇష్టం లేదు. మా నాన్న కథ చెప్పు అని దేవరను కొడుకు వర అడిగినప్పుడు చెప్పుకునే అంత కథలు లేవని అంటాడు. దొంగతనం చేస్తున్నామని తెలుసుగాని ఏం దొంగతనం చేస్తున్నాము దేవరకి కూడా తెలియదు. చదువుకో అని తాను పంపించిన బిడ్డ చనిపోయేసరికి సముద్రం మీదకు ఎవరూ వెళ్ళకూడదని ఎదురు తిరుగుతాడు'' అని ఎన్టీఆర్ వివరించారు. 

ఆ తర్వాత కొరటాల శివ ఎమోషనల్ సన్నివేశాల గురించి, ఆ బిడ్డ తల్లి దగ్గరకు వెళ్లి 'నీ కళ్ళల్లో చూసి చెప్పాల్సిన మాటను నీ కాళ్ళను చూసి చెబుతున్నా' అని దేవర చెప్పే సీన్ గురించి కొరటాల శివ చెబుతుంటే... ''దేవర 2'లో ఇంకో మంచి సీన్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడే చెప్పను. దేవరది మంచి ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది'' అని ఎన్టీఆర్ అన్నారు తప్ప ఆ సీన్ ఏమిటనేది చెప్పలేదు. ఆల్రెడీ ఆ సీన్ షూటింగ్ కూడా కంప్లీట్ చేశామని, అది లాక్ చేశామని ఆయన వివరించారు. నీటిలో ఉన్న ఆస్తి పంజరాల్లో ఒకటి చాలా కీలమైన వ్యక్తిది అని కొరటాల శివ మరొక లీక్ ఇచ్చారు.

తండ్రి కొడుకులు ఫేస్ టు ఫేస్ వచ్చే సీన్ ఉంటుందా?
'దేవర'లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. అయితే తండ్రి కొడుకులు ఫేస్ టు ఫేస్ కనిపించే సన్నివేశాలు లేవు. 'దేవర 2'లో అటువంటి సీన్ ఏమైనా ఉంటుందా? అని సుమ కనకాల అడగ్గా... ''కొడుకు, తండ్రి ఉన్నారు కదా. నేను దేవర, వర మధ్య సీన్ ఉందని చెప్పలేదు. దేవరకు మంచి సీన్ ఉందని చెప్పాను'' అని తెలిపారు.

Also Read: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!


'దేవర 2'లో ప్రేమ కథ ఇంకా బాగుంటుంది!
'దేవర' సినిమాలో హీరోయిన్, నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ క్యారెక్టర్ లెంగ్త్ తక్కువ అని ఆడియన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కథ ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందని అభిమానులు, ప్రేక్షకులు చాలా మంది భావించారు. వాళ్లకు ఎన్టీఆర్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. 'దేవర 2'లో తంగం (జాన్వీ కపూర్), వర మధ్య ప్రేమ కథ ఇంకా బాగుంటుంది'' అని తెలిపారు. పార్ట్ 2లో వచ్చే ప్రేమ కథలో ఇంకా డెప్త్ ఉంటుందని ఆయన తెలిపారు.

Also Readమెగా హీరో సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కటౌట్... 'మట్కా' టీజర్‌లో ఆ షాట్ గమనించారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desamపసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
AP Politics: క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
Embed widget