Nani: మీకు దండం పెడతా! దాంతో నాకు సంబంధం లేదు- నాని హాట్ కామెంట్స్
Actor Nani | టైర్ 1, టైర్ 2 హీరోలు అంటూ జరుగుతున్న ప్రచారంపై నాని స్పందించారు. అసలు ఇలాంటి పేర్లు ఎవరు ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదన్నారు. అసలు టైర్ల గోల గురించి తనకు తెలియదన్నారు.
Nani Interesting Comments On Tier 1 And Tier 2: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలోచిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా టైర్-1, టైర్-2 హీరోలంటూ జరుగుతున్న ప్రచారంపై స్టార్ నాని హాట్ కామెంట్స్ చేశారు.
దయచేసి టైర్ల గోల వదిలేయండి- నాని
‘సరిపోదా శనివారం’ ప్రెస్ మీట్ లో ఈ సినిమా హిట్‌తో మీరు టైర్ 1 హీరో అయిపోయినట్లేనా? అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. “దయచేసి మీరు టైర్-1, టైర్-2 హీరోలు అనే పేర్లు పెట్టకండి. మీకు దండం పెడతాను. ఇలాంటి పేర్లు ఎవరు మొదలుపెట్టారో, ఎందుకు మొదలుపెట్టారో తెలియదు. ఆ పేర్లు మీరు క్రియేట్ చేశారు. వాటిని అలాగే ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు ఈ ఇష్యూతో సంబంధం లేదు. ఈ టైర్ల గోల నుంచి నన్ను వదిలి వేయండి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నానికి సపోర్టుగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఈ టైర్ల గోల ఉండకపోవడం మంచిదంటున్నారు.
View this post on Instagram
టైర్ 1, టైర్ 2 అని పిలవకపోవడం మంచిది- దర్శకుడు వివేక్
టైర్ 1, టైర్ 2 హీరోలు అంటూ జరుగుతున్న ప్రచారంపై దర్శకుడు వివేక్ ఆత్రేయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నానితో ఇప్పటి వరకు రెండు సినిమాలు చేశాను. నాని ఫ్యాన్స్ గురించి నాకు ఓ ఐడియా ఉంది. సాధారణంగా అభిమానుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఆయన సినిమాలలో ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన ఫ్యాన్స్ ఉంటారు. ‘పిల్ల జమిందార్’ సినిమాకు ఒక రకం అభిమానులు ఉంటే, ‘జెర్సీ’ సినిమాకు మరో రకమైన అభిమానులు ఉన్నారు. ‘శ్యాం సింగరాయ్’కి మరో రకం అభిమానులు ఉన్నారు. నానిని టైర్ 1, టైర్ 2 అని రెస్ట్రిక్ట్ చేయకూడదు. ఆయన ఇంకా చాలా ముందుకు వెళ్తారు” అని చెప్పుకొచ్చారు.
2 రోజుల్లో రూ. 41 కోట్లు వసూళు
ఇక నాని నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఎస్ జే సూర్య నెగెటివ్ రోల్ లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈసినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ మూవీ ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. రెండు రోజుల్లో రూ. 41 కోట్లు వసూళు చేసింది. ఈ సినిమాకు పోటీగా సినిమాలు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర మరిన్ని వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
Read Also: నేను ఏ పవర్ గ్రూప్‌లో భాగం కాదు, మలయాళీ ఇండస్ట్రీని నాశనం చేయొద్దు: మోహన్ లాల్