News
News
X

Bandla Ganesh: హీరోగా మారబోతున్న బండ్ల గణేష్.. ఆ చిత్రం రీమేక్‌తో థ్రిల్ చేస్తారట!

సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించిన బండ్ల గణేష్.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

FOLLOW US: 

ఒకప్పుడు హాస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయమైన బండ్ల గణేష్.. ఆ తర్వాత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. చివరికి రాజకీయ నాయకుడిగానూ తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు. అయితే, ఓ ఇంటర్వ్యూలో బ్లేడుతో పీక కోసుకుంటా అని కామెంట్ చేసి పుణ్యానికి.. బ్లేడు గణేష్ అంటూ నెటిజనులు ట్రోల్ చేశారు. మొత్తానికి ఆ ముద్ర నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న బండ్ల గణేష్.. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారు. 

ఔనండి.. నిజమే, మన బండ్లన్న హీరోగా కానున్నారు. తమిళ సూపర్ హిట్ సినిమా ‘ఒత్త సెరుప్పు అళపు 7’ చిత్రంలో హీరో పార్గిబన్ పోషించిన పాత్రలో గణేష్ కనిపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కేవలం ఒకే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈ పాత్రలో పార్తీబన్ ఎంతో చక్కని నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు.. ఈ సినిమా దర్శకుడు కూడా ఆయనే. 

ఈ సినిమా మంచి హిట్ సాధించడంతో హిందీలో అభిషేక్ బచ్చన్ రిమేక్ చేస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాకు వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్1గా స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబరు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రానికి అరుణ్ దేవినేని ఛాయాగ్రహకులు. అయితే, బండ్ల గణేష్ తనతంట తానుగా ఈ సినిమాను ఎంచుకోలేదు. దర్శక నిర్మాతలే ఆ పాత్ర కోసం బండ్ల గణేష్‌ను సంప్రదించారట. కథ భిన్నంగా ఉండటంతో బండ్ల గణేష్ కూడా ఇందుకు అంగీకరించారట. మరి బండ్ల గణేష్ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. పార్తిబన్ నటించిన ‘ఒత్త సెరుప్పు అళపు 7’ ట్రైలర్‌ను ఇక్కడ చూడండి. 

ట్రైలర్:

ఈ చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని (ప్రత్యేక జ్యూరీ అవార్డు) అందుకుంది. ఉత్తమ ఆడియోగ్రఫీ అవార్డును కూడా దక్కించుకుంది. ఒకే వ్యక్తి రచన, దర్శకత్వం వహించడమే కాకుండా, సోలోగా నటించినందుకు ఈ చిత్రాన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌కు ఎక్కింది. సోలో యాక్ట్‌తో ఈ సినిమా ప్రపంచంలో 13వ చిత్రంగా నిలిచింది. అభిషేక్ బచ్చన్ హీరోగా ఇప్పటికే ఈ చిత్రం రీమేక్ షూటింగ్ మొదలైంది. చెన్నైలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు.

Also Read: ఉత్తమ నటిగా సమంత.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న అక్కినేని కోడలు

Also Read: చిరంజీవి బర్త్‌డేకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న కూతురు సుష్మిత

Also Read: వైష్ణవ్ తేజ్-క్రిష్ మూవీ టైటిల్ ఖరారు.. ఫస్ట్ లుక్ వీడియో అదుర్స్

Published at : 20 Aug 2021 08:28 PM (IST) Tags: Bandla Ganesh Bandla Ganesh as Hero Oththa Seruppu Size 7 బండ్ల గణేష్

సంబంధిత కథనాలు

బిగ్ బాస్‌లో ‘జంబ లకిడి పంబ’ రెండో స్టేజ్, పిల్లలుగా మారిన కంటెస్టెంట్స్, శ్రీహన్‌కు చుక్కలు!

బిగ్ బాస్‌లో ‘జంబ లకిడి పంబ’ రెండో స్టేజ్, పిల్లలుగా మారిన కంటెస్టెంట్స్, శ్రీహన్‌కు చుక్కలు!

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

Sree Leela: రామ్, బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, షూటింగ్ తేదీ ఫిక్స్!

Sree Leela: రామ్, బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, షూటింగ్ తేదీ ఫిక్స్!

Ram - Boyapati Movie Update : రామ్ జోడీగా శ్రీలీల - 'అఖండ' తర్వాత బోయపాటి, తమన్ కాంబినేషన్ రిపీట్

Ram - Boyapati Movie Update : రామ్ జోడీగా శ్రీలీల - 'అఖండ' తర్వాత బోయపాటి, తమన్ కాంబినేషన్ రిపీట్

Puneeth Rajkumar : తెలుగులోకి మరో పవర్ స్టార్ సినిమా - దసరాకు 'సివిల్ ఇంజనీర్' టీజర్ రిలీజ్

Puneeth Rajkumar : తెలుగులోకి మరో పవర్ స్టార్ సినిమా - దసరాకు 'సివిల్ ఇంజనీర్' టీజర్ రిలీజ్

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

కేంద్ర అధికార దుర్వినియోగంపై గట్టిగా పోరాడాలి- కేసీఆర్‌కు కుమార స్వామి శుభాకాంక్షలు

కేంద్ర అధికార దుర్వినియోగంపై గట్టిగా పోరాడాలి- కేసీఆర్‌కు కుమార స్వామి శుభాకాంక్షలు