By: ABP Desam | Updated at : 29 Apr 2022 05:36 PM (IST)
ఓటీటీలో 'ఆచార్య' - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' సినిమా ఈరోజే(ఏప్రిల్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. మెగాఫ్యాన్స్ కు ఈ సినిమా నచ్చుతుందని.. కానీ జెనరల్ ఆడియన్స్ ని ఈ సినిమా మెప్పించలేకపోయిందని అంటున్నారు. ఈ విషయంలో దర్శకుడు కొరటాల శివను టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇద్దరు మెగా హీరోలు ఉన్న సినిమాలో ఎలివేషన్ సీన్లే లేవని మండిపడుతున్నారు ప్రేక్షకులు. కొరటాల ఇంత వీక్ స్టోరీ ఎలా రాసుకున్నాడంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజు మాత్రం ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వీకెండ్ లో కలెక్షన్స్ పుంజుకుంటుందేమో చూడాలి. ఇక త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో సందడి చేయబోతోందని సమాచారం.
ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
థియేటర్లో విడుదలైన మూడు వారాల తరువాత సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే మే చివరి వారం నుంచి 'ఆచార్య'లో అమెజాన్ లో సందడి చేయబోతుందన్నమాట. అయితే ఈ మధ్యకాలంలో నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాలను ముందే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. 'రాధేశ్యామ్', 'గని' సినిమాల విషయంలో ఇలానే జరిగింది. మరిప్పుడు 'ఆచార్య'ను కూడా మూడు వారాల కంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో చూడాలి.
Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?
Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా
IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్గా కేఎల్ రాహుల్ - సఫారీ సిరీస్కు జట్టు ఎంపిక