By: ABP Desam | Updated at : 30 Nov 2021 06:58 PM (IST)
Edited By: RamaLakshmibai
Sirivennela
సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా ప్రస్థానం ప్రారంభించిన సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ప్రతిపాటా అద్భుతమే. ఆ సినిమా కోసం రాసిన తొలిపాట విధాత తలపున పాట ఇప్పటికీ రచయితలకు ఓ సవాల్ అనిపిస్తుంది. ఈ గాలి ఈ నేల అంటూ సొంతూరుని పలకరించినా, చందమామ రావే అంటూ చిన్నపిల్లల్ని మురిపించినా, ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో అంటూ పరవశింపచేసినన ఘటత సిరివెన్నెలదే. ఇందులో మరింత ఆకట్టుకునే పాట 'ఆది భిక్షువు' . ఈ పాట మొత్తం పరమేశ్వరుడిని నిందిస్తున్నట్టు ..అదే సమయంలో కీర్తిస్తున్నట్టు ఉంటుంది. దీన్నే నిందాస్తుతి అంటారు..
ఆ పాటలో సాహిత్యం మొత్తం ఓసారి చూడండి...
ఆదిభిక్షువు వాడినేది కోరేదీ
బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది
ఆదిభిక్షువు వాడినేది కోరేదీ
బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
తీపిరాగాల కోకిలమ్మకు
నల్ల రంగునలమిన వాడినేది కోరేది
తీపిరాగాల కోకిలమ్మకు
నల్ల రంగునలమిన వాడినేది కోరేది
కరకు ఘర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
తేనెలొలికే పూల బాలలకు
మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు
మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని
ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
దరిజేరు మన్మధుని మసిజేసినాడు
వాడినేది కోరేది
వరగర్వమున మూడులోకాల పీడింప
తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు
వాడినేది కోరేదీ
ముక్కంటి ముక్కోపి
ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
ఆదిభిక్షువు వాడినేది కోరేదీ
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
పాట ఇక్కడ చూడండి
Also Read:
అన్నిపాటల్లా దీనికి ఆరంభంలో మ్యూజిక్ ఉండదు...మొదలుకావడమే.. 'ఆదిభిక్షువు వాడినేది కోరేది.. బూడిదిచ్చేవాడినేది అడిగేది..? ఏది కోరేది..? వాడినేది అడిగేది..?' అంటూ మొదలైపోతుంది.
బూడిదిచ్చేవాడిని ఏమి అడిగేదంటూనే.. పాటమొత్తం వర్ణన చెప్పడానికి మాటలు సరిపోవు..
Also Read: తొలిపాటకే 'నంది' అందుకున్న సిరివెన్నెల.. రాయడానికి ఎన్నిరోజులు పట్టిందంటే..
తియ్యటి పాటలు పాడే కోకిలకి నలుపు రంగేంటి..? గర్జనలు చేసే ఆ మేఘాలకి మెరుపులు అద్దడం ఏంటి..?
పాటలో కోకిల-మేఘానికి సంబంధం ఏంటి.. ఒకటి ప్రాణం ఉన్నది- ఇంకొకటి ప్రాణం లేనిది..వాటిని లింక్ చేస్తూ రాసి మెప్పించిన ఘనత సీతారామశాస్త్రిదే..
మకరందాన్ని ఇచ్చే పువ్వులకి మూడే రోజులు ఆయుష్షు ఇచ్చి.. అచేతనంగా పడుండే ఆ రాళ్ళకు చిరంజీవిత్వాన్ని ప్రసాదించిన వాడిని ఏది కోరిది అని రాశారు. ఆఖర్లో అయితే ముక్కంటి, ముక్కోపి, తిక్కశంకరుడు అని ప్రస్తావించారు.
ఇదంతా శివుడిని తిట్టడమే కదా అంటారేమో... తిట్టడం కాదు కోకిల, మేఘం, పువ్వు, రాయి, యావత్ విశ్వానికి ఆయనే అధిపతి అని అర్థం.
Also Read: మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!
Also Read: సిరివెన్నెలను చేరి పులకరించిన పురస్కారాలు...
Also Read: నాలుగు రోజులుగా సిరివెన్నెల ప్రాణం నిలిచింది ‘ఎక్మో’పైనే... ఎక్మో అంటే? అదెలా ఆయన ప్రాణాలు నిలిపింది?
Also Read: సిరివెన్నెల దృష్టిలో 'క్లిష్టమైన పాట..'
Also Read: 'సిరివెన్నెల'కు ముందు సీతారామ శాస్త్రి జీవితం ఇదీ...
NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్
Ram Charan-NTR: నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను - రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్‌డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nara Lokesh : ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఘటనపై లోకేశ్ ఫైర్, హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని ఆరోపణ!
TTD Darshan Tickets For July, August : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం
CBI Raids: లాలూ యాదవ్కు మరో షాక్- కొత్త అభియోగాలు మోపిన సీబీఐ
Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి