అన్వేషించండి

TDP News: బీజేపీ, టీడీపీ పొత్తు ప్రకటన ఎందుకు ఆలస్యమవుతోంది? ఇంకా సీట్ల పంచాయితీ తెగలేదా?

TDP BJP Janasena News: ఎన్డీఏలోకి టీడీపీ.. అంటు మూడు రోజుల నుంచి బ్రేకింగ్‌లు పడుతున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఆలస్యమవుతోంది. దీని వెనుక ఉన్న కారణమేంటీ?

Andhra Pradesh News: ప్రతి సీన్‌ కూడా క్లైమాక్స్‌లో ఉంటుందని అని అప్పట్లో ఓ సినిమా డైలాగ్‌. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయానికి సరిపోతుంది. ఇంకా ముఖ్యంగా టీడీపీ, బీజేపీ పొత్తుకు అతికినట్టు ఉంటుంది. అవును నిజమే. వీరి స్నేహంపై గంటకో బ్రేకింగ్‌ న్యూస్‌ పూటకో షాకింగ్ న్యూస్‌. ఇదిగో పొత్తు ఖాయమైపోయిందని ఒకసారి. లేదు లేదు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి మరోసారి. అన్నీ ఓకే కానీ సీట్ల పంచాయితే తెగలేదని ఇంకొకసారి. ఇలా తెలుగు సీరియల్‌లా ఎపిసోడ్‌ ఎపిసోడ్‌లు సాగిపోతూనే ఉంది. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకీ ఆలస్యం.?

బీజేపీ, టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని వాస్తవం. ఇంకా సీట్ల పంచాయితీ విషయంలో ఎలాంటి వివాదం లేదంటున్నారు. కేవలం పొత్తును అధికారికంగా ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉందని అంటున్నారు. మరి ఎందుకు ఆలస్యమైంది అంటే బీజేపీ నేతల షెడ్యూల్ కారణంగానే అంటున్నారు. 

పొత్తులు సీట్ల ప్రకటన విషయంలో అమిత్‌షా కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తమ పార్టీ నాయకులను పిలిపించి ఎవరితో పొత్తు ఉండాలో ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలో బలాబలాల ఆధారంగా ఎన్ని సీట్లలో పోటీ చేయాలో నిర్ణయిస్తున్నారు. శుక్రవారం కూడా అదే జరిగింది. మహారాష్ట్ర ఒడిశా రాష్ట్ర నేతలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. 

ముందు ఒడిశా రాష్ట్ర నేతలతో సమావేశం అయ్యారు. అక్కడ నవీన్‌ పట్నాయక్‌ను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారు. అందుకే బీజేడీతో పొత్తులో భాగంగా పోటీ చేయాల్సిన సీట్లు, మిగతా సర్దుబాట్లపై వారితో చర్చించారు. అక్కడ బలాలను ‌అంచనా వేసుకొని ఓ లిస్ట్ ప్రిపేర్‌ చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ప్రకటించబోయే రెండో జాబితాలో ఒడిశాలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉంటాయి. 

ఆ తర్వాత మహారాష్ట్ర నేతలతో మాట్లాడారు. కాంగ్రెస్, ఉద్దవ్‌ ఠాక్రేను కాదని వచ్చిన నేతల భవిష్యత్‌పై ఏక్‌నాథ్‌షిండే, మహారాష్ట్ర బీజేపీ నేతలతో మంతనాలు జరిపారు. వారిని ఏక్‌నాథ్‌ షిండే శివసేన, బీజేపీ ఇతర రెబల్ అభ్యర్థులు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనేతి చర్చించారు. అయితే రెండు మూడు సీట్ల వ్యవహారంలో ఇరు వర్గాలు పట్టుబట్టారు. దీంతో చర్చలు అర్థరాత్రి వరకు సాగాయి. 

మహారాష్ట్ర సీట్ల వ్యవహారం త్వరగా తేల్చుకుని టీడీపీ, జనసేనతో చర్చించాల్సి ఉందని అంటున్నారు. అయితే మహారాష్ట్ర పంచాయితీ సుదీర్ఘంగా కొనసాగడంతో ఏపీ వ్యవహారం వాయిదా వేశారని సమాచారం. ఇవాళ కచ్చితంగా దీనిపై ప్రకటన ఉంటుందని అంటున్నారు. 

ఏపీలో సీట్ల పంచాయితీ లేదని సమాచారం. జనసేన, బీజేపీ కలిసి 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతుందని... ఆ రెండు పార్టీలకుు 8 వరకు పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించిందని తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు ప్రకటించిన 24 స్థానాలు మినహాయిస్తే బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతోంది. పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే జనసేనకు 3 స్థానాలను టీడీపీ ఇచ్చింది. అంటే మిగిలిన ఐదు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబడే ఛాన్స్ ఉంది. 
అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీ జనసేనకు కేటాయించారు. మిగిలిన చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీకి దిగుతారు. 

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Polls: ఏపీ స్థానిక పోరులో రణరంగం.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
స్థానిక పోరులో మొదలైన రచ్చ.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
YSRCP Candidates: వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
TDP Janasena and BJP Seat Sharing: ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు.. ఎవరు ఎక్కడి నుంచి చేస్తారంటే
ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు.. ఎవరు ఎక్కడి నుంచి చేస్తారంటే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget