అన్వేషించండి

Uttarandhra Politics: వారసుల రాజకీయ భవితవ్యంపై ఉత్తరాంధ్ర కీలక నేతల మథనం

ఉత్తరాంధ్రలోని పలు పార్టీల్లో కీలక నేతలుగా ఎదిగిన నాయకులు తమ వారసుల రాజకీయ భవితవ్యంపై మథనపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వారసులను రాజకీయ రంగప్రవేశం చేయించి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావించారు.

Andhra Pradesh Elections 2024: ఉత్తరాంధ్రలోని పలు పార్టీల్లో కీలక నేతలుగా ఎదిగిన నాయకులు తమ వారసుల రాజకీయ భవితవ్యంపై మథనపడుతున్నారు. గడిచిన 20, 30 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తూ.. అనేకసార్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పని చేసని ముఖ్యమైన నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రాజకీయ రంగప్రవేశం చేయించి.. శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావించారు. అందుకు అనుగుణంగా గ్రౌండ్‌ను చాలా మంది నాయకులు ప్రిపేర్‌ చేశారు. కానీ, ఆయా నేతలకు పార్టీ అధిష్టానం నుంచి వారసుల రాజకీయ రంగ ప్రవేశానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించకపోవడంతో మరోసారి పోటీ చేయాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. వారసులను రంగ ప్రవేశం చేయించాలనుకునే వారి జాబితాలో వైసీపీతోపాటు టీడీపీలోనూ ఎక్కువగానే ఉంది. పార్టీ అధినాయకత్వ సూచనలతో సీనియర్‌ నేతలే మరోసారి బరిలోకి దిగాల్సి వస్తుండడంతో వారుసలకు మరికొంత కాలం నిరీక్షణ తప్పని పరిస్థితి ఏర్పడింది. 

బొత్స నుంచి అయ్యన్న కుమారుడి వరకు

వారుసుల రాజకీయ రంగప్రవేశం చేయించాలని భావించిన నాయకులు జాబితాలో సీనియర్‌ మంత్రి, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ముందు వరుసలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో రాజకీయ వారుసుడిని బరిలోకి దించాలని ఆయన ముందు నుంచీ భావిస్తూ వచ్చారు. ఇందుకోసం చాలా కాలం కిందటి నుంచే ఆయన గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేశారు. మాజీ ఎంపీ, తాజా విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి(Botsa Jhanshi), మంత్సి బొత్స సత్యనారాయణ కుమారుడు డాక్టర్‌ బొత్స సందీప్‌(Botsa Sandeep)ను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించేందుకు సిద్ధమయ్యారు. డాక్టర్‌ బొత్స సందీప్‌ కూడా గత కొన్నాళ్లు నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. మెడికల్‌ క్యాంపులు, సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. కానీ, అనూహ్యంగా వైసీపీ అధిష్టానం బొత్స సందీప్‌ పోటీకి క్లియరెన్స్‌ ఇవ్వలేదు. ఈసారి కూడా బొత్స సత్యనారాయణ దంపతులు బరిలో ఉండాలని సీఎం జగన్‌ బలంగా ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగానే వారి అభ్యర్థిత్వాలను ఖరారు చేయడంతో సందీప్‌ మరికొంత కాలం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో వారుసులను బరిలో దించాలని భావిస్తున్న నాయకుల సంఖ్య అధికంగానే ఉంది. స్పీకర్‌ తమ్నినేని సీతారాం(Tammineni Sitaram) తన కుమారుడు చిరంజీవి నాగ్‌(Chiranjeevi Nag)ను పోటీ చేయించాలని భావించారు. అధిష్టానం నుంచి సానుకూలత రాకపోవడంతో ఆయనే పోటీకి సిద్ధపడుతున్నారు. ఇక్కడ ఆయనకు పోటీగా మరో వ్యక్తి బలంగా పని చేస్తుండడంతో ఇక్కడ పోటీ వాతావరణం నెలకొంది.

ఇదే జిల్లాలో సీనియర్‌ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) కుమారుడిని బరిలోకి దించాలని భావించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి నియోజకవర్గం అంతటా ఆయన కుమారుడు రామ్‌ మనోహర్‌ నాయుడు(Ram Manohar Naidu) విస్తృతంగా పర్యటిస్తున్నారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. ధర్మాన ప్రసాదరావు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, పార్టీకి పని చేస్తానన స్పష్టం చేశారు. కానీ, సీఎం జగన్‌ ఇందుకు అంగీకరించలేదని, మళ్లీ ఆయన్నే బరిలో దిగాలని కోరుతున్నట్టు చెబుతున్నారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో మరోసారి బరిలో నిలిచేందుకు ధర్మాన సిద్ధమవుతున్నారు. 

మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌(Dharmana Krishna Das) కూడా వారసుడిని అసెంంబ్లీకి పంపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో జెడ్పీటీసీగా బరిలోకి దిగిన ఆయన కుమారుడు ధర్మాన కృష్ణ చైతన్య(Dharmana Krishna Chaitanya ) వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి వెళ్లేందుకు అనుగుణంగా పని చేసుకుంటూ వచ్చారు. కానీ, అధిష్టానం నుంచి అనుమతి రాకపోవడంతో మళ్లీ కృష్ణదాస్‌ పోటీకి సిద్ధపడుతున్నారు.

తెలుగుదేశం పార్టీలోనూ వారసుల పోటీ ఎక్కువగానే ఉంది. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు(Kimidi Kalavenkata Rao) కుమారుడిని ఈ ఎన్నికల్లో బరిలోకి దించేందుకు సిద్ధమయ్యారు. ఎచ్చెర్ల నుంచి రామ్‌ మల్లిక్‌ నాయుడి(Ram Mallik Naidu)ని బరిలోకి దించాలని భావించి కళా.. పార్టీ నుంచి సానుకూలత రాకపోవడంతో మళ్లీ ఆయనే పోటీకి సిద్ధపడుతున్నారు. మాజీ మంత్రి ప్రతిభా భారతి(Pratibha Bharati) కూడా తన వారసురాలు కావలి గ్రీష్మ(Kavali Greeshma)ను పోటీ చేయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం సీటు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ, పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఎదురు చూస్తున్నారు. 

విశాఖ(Visakha) జిల్లాలోనూ పలువురు సీనియర్‌ నేతల వారసులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)కి చెందిన నాయకులు వారసులు రెడీగా ఉన్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) కుమారుడు విజయ్‌(Vijay), బండారు సత్యనారాయణమూర్తి(Bandu Satya Narayana Murthy) కుమారుడు అప్పలనాయుడు(Appala Naidu) ఉన్నారు. అయ్యన్నపాత్రుడు తనకు నర్సీపట్నం ఎమ్మెల్యే స్థానంతోపాటు కుమారుడికి అనకాపల్లి ఎంపీ స్థానాన్ని కేటాయించాల్సిందిగా అధిష్టానాన్ని కోరుతున్నారు. పార్టీ నుంచి ఇంకా సానుకూల స్పందన రాకపోవడంతో ఎదురు చూపులు తప్పడం లేదు. మాజీ మంత్రి బండారు కుమారుడు గడిచిన ఐదేళ్ల నుంచి పార్టీ వ్యవహారాలను పెందుర్తి నియోజకవర్గంలో చక్కబెడుతున్నారు. కానీ, పార్టీ ఇప్పట్లో అప్పలనాయుడుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నియోజకవర్గంలో సీటును జనసేనకు ఇచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారసుడి పేరు ప్రతిపాదించడం కంటే.. తన పేరుతోనే ముందుకు వెళ్లడం వల్ల ఫలితం ఉంటుందని సత్యనారాయణమూర్తి భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక్కడి లెక్కలు ఆధారంగా అప్పలనాయుడు మరికొంత కాలం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఎన్నికలు కీలకం.. పోటీ ఎక్కువ

రానున్న ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విజయమే లక్ష్యంగా పోటీకి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో రాజకీయ అనుభవం లేని వారసులను పోటీలోకి దింపడం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుందని పార్టీ అధిష్టానాలు భావిస్తున్నాయి. సీనియర్‌ నాయకులు బరిలో దిగితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని పార్టీ నాయకత్వాలు భావిస్తుండడం వల్లే.. వారసులకు క్లియరెన్స్‌ ఇవ్వడం లేదు. వారసులకు టికెట్లు ఇవ్వడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు విజయావకాశాలను పెంచే అవకాశముంటుందని సర్వేలు ద్వారా పార్టీలు గుర్తించాయి. అందుకే వారసులను ఈసారికి పోటీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

DCP Vineet With ABP Desam: న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Dil Raju Reply To KTR:   చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DCP Vineet With ABP Desam: న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Dil Raju Reply To KTR:   చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Crime News: ఆ బిడ్డ తనకు పుట్టలేదని అనుమానం - 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించేశాడు, ఒంగోలులో దారుణం
ఆ బిడ్డ తనకు పుట్టలేదని అనుమానం - 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించేశాడు, ఒంగోలులో దారుణం
5000 Note in New Year: 2025లో  రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
2025లో రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
Embed widget