Rajnath Singh Pushpa Dialogue: పుష్ప డైలాగ్‌తో అదరగొట్టిన రాజ్‌నాథ్.. 'పుష్కర్ అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్'
ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పుష్ప' సినిమా డైలాగులు హోరెత్తుతున్నాయి. తాజాగా దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పుష్ప డైలాగ్‌ను తనదైన స్టైల్‌లో చెప్పారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పుష్ప క్రేజ్ సౌంత్ ఇండియాతో పాటు ఉత్తర భారతంలోని మాములుగా లేదు. ఇప్పటికే సినిమా స్టార్లతో పాటు క్రికెటర్లు కూడా పుష్ప సినిమా డైలాగులు, పాటలతో హోరెత్తించేస్తున్నారు. అయితే తాజాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పుష్ప డైలాగ్‌తో అదరగొట్టేశారు.
పుష్కర్ ఫైర్..
Defence Minister Rajnath singh about #Pushpa .The reach is beyond boundaries pic.twitter.com/ziWpW1kwCY
— Charan Reddy (@CharanReddy_78) February 8, 2022
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నోట 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్' అనే డైలాగ్ వినిపించింది. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ ఈ డైలాగ్‌తో హోరెత్తించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీని.. పుష్పతో పోలుస్తూ ఈ డైలాగ్ చెప్పారు. గంగోలిహట్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ పుష్ప డైలాగ్ చెప్పారు.
ప్రస్తుతం దేశంలో ఓ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా పేరు పుష్ప. ఉత్తరాఖండ్‌లో కూడా ఒక పుష్కర్ ఉన్నారు. ఆయన చాలా సౌమ్యంగా ఉంటారు. ఆయన పేరు పుష్కర్ కదా అని ఆయన్ను ఫ్లవర్ అనుకోవద్దు.. ఆయన ఫైర్ కూడా. ఆయనను ఎవరూ ఆపలేరు, తగ్గేదే లేదు,
కాంగ్రెస్ కూడా..
కాంగ్రెస్ కూడా పుష్ప క్రేజ్‌ను ఎన్నికల కోసం ఉపయోగించింది. పుష్ప సినిమాలోని చూపే బంగారమాయేనే శ్రీవల్లి సాంగ్‌ను కాంగ్రెస్ పార్టీ యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం రీమేక్ చేసింది. ఆ మ్యూజిక్‌తో 'తూ హై గజాబ్ యూ, యూపీ, తేరీ కసమ్, యూపీ'.. అంటూ వీడియో రూపొందించింది.
ఇందులో రాణీ లక్ష్మీబాయి సహా ఎంతో మంది గొప్ప వ్యక్తుల గురించి ప్రస్తావించారు. దీంతో పాటు రాష్ట్ర గొప్పతనాన్ని తెలియజేశారు. వీడియోలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.