Karnataka Hijab Row: 'హిజాబ్ కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ.. మేం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం'
హిజాబ్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ అయింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కర్ణాటక హైకోర్టు ప్రస్తుత ధర్మాసనం నిరాకరించింది.
హిజాబ్ వివాదంపై దాఖలైన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ క్రృష్ణ దీక్షిత్ ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసింది.
BREAKING : Single Bench of Karnataka High Court refers the #HijabBan issue to larger bench. Single Bench refuses to pass interim orders permitting girls to attend colleges wearing #Hijab and says that interim relief is to be considered by the larger bench.#KarnatakaHighCourt https://t.co/SDYf4zZM3u
— Live Law (@LiveLawIndia) February 9, 2022
హిజాబ్ ధరించి కళాశాలలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. విస్తృత ధర్మాసనమే ఈ ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది.
కీలక వ్యాఖ్యలు..
ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు శాంతిగా ఉండాలని కోరింది.
" విద్యార్థులు శాంతి సామరస్యతను పాటించాలి. వీధుల్లోకి వెళ్లడం, నినాదాలు చేయడం, రాళ్లు రువ్వుకోవడం, ఇతర విద్యార్థులపై దాడులు చేయడం వంటివి మంచి అలవాట్లు కావు. టీవీల్లో విద్యార్థులపై కాల్పులు, రక్తం చిందడం వంటివి చూస్తే.. మేం తట్టుకోలేం. సరిగా ఆలోచించలేం. మేం చట్టానికి అనుగుణంగా తీర్పు ఇస్తాం.. కానీ ఎవరి భావోద్వేగాలను మేం లెక్కలోకి తీసుకోం. రాజ్యాంగం ఏం చెప్పిందో మేం అదే చేస్తాం. మాకు రాజ్యాంగమే భగవద్గీత. "
మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్' నినాదాలతో ర్యాలీలు చేసిన వీడియోలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి.
దీంతో కర్ణాటక సర్కార్ శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసేంది. శాంతి భద్రతలను దెబ్బతీసే రీతిలో విద్యాసంస్థల్లో విద్యార్థులు దుస్తుల్ని ధరించడానికి వీల్లేదంటూ తాజా ఉత్తర్వుల్లో నిషేధాజ‍్క్షలు జారీ చేసింది.