(Source: ECI/ABP News/ABP Majha)
UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్ తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం.. 50 వేలమంది పారామిలటరీ బలగాల మోహరింపు
ఉత్తర్‌ప్రదేశ్ తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 10న జరగనున్న యూపీ తొలి విడత పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీకి మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరగనుంది.
Check out the list of documents which are recognized as identity proof for polling. Gear up! Assembly elections are here! #AssemblyElections #GoVerify #ElectionCommissionOfIndia #ECI pic.twitter.com/u8xsmja7AS
— Election Commission of India #SVEEP (@ECISVEEP) February 9, 2022
11 జిల్లాల్లో..
తొలి విడత పోలింగ్‌లో భాగంగా యూపీలోని 11 జిల్లాలకు చెందిన 58 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. షామిలి, మథుర, ఆగ్రా, ముజఫర్‌నగర్, బాగ్‌పట్, మేరట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్, హపుర్, బులంద్‌షహర్, అలీగఢ్.. జిల్లాల్లో ఈ పోలింగ్ జరగనుంది.
తొలి విడత ఎన్నికలకు ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. 7 విడతల యూపీ ఎన్నికల పోలింగ్ మార్చి 7న ముగియనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
భారీ భద్రత..
పోలింగ్ సందర్భంగా ఎలాంచి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్)కు చెందిన 412 కంపెనీల నుంచి దాదాపు 50 వేల బలగాలను పశ్చిమ యూపీ వ్యాప్తంగా మోహరించింది.
యూపీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. గురువారం పోలింగ్ జరగనున్న 58 నియోజకవర్గాల్లో పోలీసులు నిఘా పెట్టారు.
వాహనాల తనిఖీ..
హరియాణా, రాజస్థాన్ సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లను పోలీసులు కట్టుదిట్టంగా చెక్ చేస్తున్నారు. అటుగా వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 48 గంటల పాటు లిక్కర్ షాపులను మూసివేయనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల లోపుల ఎక్కడైనా రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సంబంధించిన పోస్టర్, బ్యానర్, హోర్డింగ్ కనిపిస్తే ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద పరిగణిస్తామని హెచ్చరించారు.
Also Read: Rahul Gandhi on BJP Govt: 'మోదీజీ.. సమతామూర్తి విగ్రహం మేడ్ ఇన్ చైనా.. ఇదేనా ఆత్మనిర్భర్ భారత్?'
Also Read: Karnataka Hijab Row: 'హిజాబ్ కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ.. మేం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం'