(Source: ECI/ABP News/ABP Majha)
UP Election 2022: 'మాఫియా' చుట్టూ యూపీ రాజకీయం.. నిన్న మోదీ, నేడు అమిత్ షా.. ఒకటే కౌంటర్!
మాయావతి, అఖిలేశ్ యాదవ్ పాలనలో యూపీ మాఫియా అడ్డాగా ఉండేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ రాజకీయ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటివరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే.. సమాజ్‌వాదీ నేతలను మాఫియా పేరుతో విమర్శించారు. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ 'మాఫియా' పేరుతోనే విమర్శలు చేస్తున్నారు. యూపీ రాజకీయం మొత్తం ఇప్పుడు మాఫియా చుట్టూనే తిరుగుతోంది.
తాజాగా యూపీ ఎన్నికల ప్రచారం చేస్తోన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మాయావతి, అఖిలేశ్ యాదవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వారిద్దరి పాలనలో యూపీలో మాఫియా అడ్డాగా ఉండేదన్నారు. యూపీలోని సహస్వాన్‌లో జరిగిన భారీ బహిరంగ ర్యాలీలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
7 విడతల్లో..
403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు మొదలుకానున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.
Also Read: TMC in Lok Sabha Polls: మోదీని గద్దె దించేందుకు దీదీ ప్లాన్.. 2024 ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ!
Also Read: UP Election 2022: యూపీ మాజీ మంత్రులు మౌర్య, అభిషేక్ మిశ్రాకు టికెట్లు ఇచ్చిన ఎస్పీ