India vs Oman Asia Cup 2025 Highlights | పోరాడి ఓడిన ఒమన్
ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా మూడో విజయాన్ని అందుకుంది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. వరుసగా యూఏఈ, పాకిస్థాన్, ఒమన్ టీమ్స్ పై ఇండియా విక్టరీ సాధించింది. అయితే ఒమాన్ మాత్రం ఇండియాకు గట్టి పోటీని ఇచ్చి 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56, ఓపెనర్ అభిషేక్ శర్మ 38 పరుగులు చేసారు. అక్షర్ పటేల్ 26, తిలక్ వర్మ 29 రన్స్ చేసి పర్వాలేదనిపించారు. కానీ మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మిగతా వారికి అవకాశం ఇస్తూ తానే బ్యాటింగ్‌కు రాలేదు.
ఇక 189 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఒమన్ ఇండియా బౌలర్స్ ను బాగానే ఎదుర్కొంది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది ఒమాన్ టీమ్. కేవలం 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఒమన్ టాపార్డర్ బ్యాట్స్మన్ కు అందరు ఫిదా అయిపొయ్యారు. మొత్తంగా ఆసియా కప్‌లో టీమిండియా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.



















