Akhanda 2 Song: 600 మంది డ్యాన్సర్స్... బాలయ్య హై ఎనర్జీ మాస్ సాంగ్ - థియేటర్స్ దద్దరిల్లడం కన్ఫర్మ్
Akahnda 2 Update: బాలయ్య ఫ్యాన్స్‌కు నిజంగా గూస్ బంప్స్ గ్యారంటీ న్యూస్. 'అఖండ 2'లో ఓ హై ఎనర్జీ మాస్ సాంగ్ ఉండబోతోంది. దాదాపు 600 మంది డ్యాన్సర్లతో దీన్ని షూట్ చేశారు.

Balakrishna's Akhanda 2 Update: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హై యాక్షన్ థ్రిల్లర్ 'అఖండ 2' శరవేగంగా సిద్ధం అవుతోంది. బాలయ్య ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించేలా సాంగ్స్ నుంచి ట్రైలర్ వరకూ అన్నింటినీ మేకర్స్ రెడీ చేస్తున్నారు. తాజాగా మరో లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది.
మాస్ సాంగ్... గూస్ బంప్స్ గ్యారెంటీ
ప్రస్తుతం బాలయ్యపై ఓ హై ఎనర్జీ మాస్ సాంగ్ షూట్ చేస్తున్నారు. దీని కోసం స్పెషల్‌గా ఓ గ్రాండ్ సెట్ క్రియేట్ చేశారట. అందులో దాదాపు 600 మంది డ్యాన్సర్లతో పవర్ ఫుల్ మాస్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికి ఫేమస్ భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. బాలయ్య అంటేనే మాస్... అలాంటి గాడ్ ఆఫ్ మాస్‌కే హై ఎనర్జీ వచ్చేలా ఈ సాంగ్ ఉండబోతోందట. తమన్ మ్యూజిక్, బాలయ్య మాస్ డ్యాన్స్‌తో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమేనని ఫ్యాన్స్ అంటున్నారు.
Also Read: 'OG' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ - సింగిల్ డే... పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా
2021లో రిలీజ్ అయిన 'అఖండ' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. బాలయ్య, బోయపాటి కాంబోలో బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక దీనికి సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ వేరే లెవల్‌లో ఉంది. హిమాలయాల్లో బాలయ్య రుద్ర తాండవం, సాక్షాత్తూ శివుడే నేలకు దిగి వచ్చాడా అనేలా యాక్షన్ సీన్స్ అదరగొడుతున్నాయి. ముఖ్యంగా త్రిశూలంతోనే శత్రు సంహారం చేస్తున్నట్లుగా ఉన్న సిగ్నేచర్ షాట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దీంతో పాటే డ్రగ్స్‌పై ఉక్కుపాదం, ఆధ్యాత్మికం, సనాతన ధర్మం అన్నీ కలగలిసేలా ఓ మంచి మెసేజ్ కూడా మూవీలో ఉందనే టాక్ వినిపిస్తోంది.
రిలీజ్ ఎప్పుడంటే?
నిజానికి ఈ నెల 25నే మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా... వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండడంతో వాయిదా పడింది. ఆడియన్స్‌కు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు టైం తీసుకున్నట్లు మూవీ టీం తెలిపింది. డిసెంబర్ 5న మూవీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్టులో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్లు టీజర్ బట్టే అర్థమవుతోంది. బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటివరకూ హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. సింహా, లెజెండ్, అఖండ మూవీస్ సెన్సేషన్ సృష్టించగా ఇప్పుడు 'అఖండ 2' కూడా అంతకు మించి హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తుండగా... టీజర్‌లోనే ఆయన లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. వీరితో పాటు హర్షాలి మల్హోత్రా కీలక పాత్ర పోషించారు. బాలయ్య కుమార్తె ఎం.తేజస్విని సమర్పణలో '14 రీల్స్ ప్లస్' బ్యానర్‌పై రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకే బీజీఎం, సాంగ్స్ స్పెషల్ హైలైట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది.






















