OG Pre Release Event: 'OG' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ - సింగిల్ డే... పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా
OG Updates: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ కాన్సర్ట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు.

Pawan Kalyan OG Pre Release Event In Hyderabad: టైం ఇంకా 4 రోజులే. పవర్ స్టార్ మూవీ 'OG'పై టీం సోషల్ మీడియా వేదికగా ఒక్కో సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వరుస పోస్టులతో రచ్చ లేపుతుండగా... ఇక థియేటర్లలో మోత మోగడమే తరువాయి. తాజాగా 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.
సింగిల్ డే... డబుల్ బొనాంజా
'ఓజీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న (ఆదివారం) సాయంత్రం 'ఎల్బీ స్టేడియం'లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రొడ్యూసర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. గతంలో విజయవాడలో ఈవెంట్ నిర్వహిస్తారనే ప్రచారం సాగినప్పటికీ తాజాగా హైదరాబాద్‌లో వెన్యూ ఫిక్స్ చేశారు. ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనుండగా... సాయంత్రం ఈవెంట్ నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకే రోజు డబుల్ బొనాంజా అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
మరి ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా ఎవరు వస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటుండగా... గతంలో ఆయన గెస్ట్ అంటూ ప్రచారం సాగింది. ఒకవేళ చిరంజీవి వస్తే ఒకే వేదికపై అన్నదమ్ములను కలిసి చూసే ఛాన్స్ కలుగుతుందని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
LB stadium 🏟️ 🎇 @MusicThaman 🎶 #OGConcert #TheyCallHimOG https://t.co/2UAkFzkn9f
— Kalyan Dasari (@IamKalyanDasari) September 20, 2025
Also Read: పవన్ 'OG'లో శ్రియా రెడ్డి లుక్ రిలీజ్ - 'పొగరు'తో పవర్ ఫుల్‌గా గన్ టార్గెట్
ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, బీజీఎంలు వేరే లెవల్లో ఉండగా... పవన్ పాడిన జపనీస్ హైకూ 'వాషి యో వాషి' గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ గ్రోస్, జోష్‌కు తమన్ బీజీఎం తోడైతే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని... ఈ ట్రైలర్ అన్నీ రికార్డులను చెరిపేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో భారీ హైప్
ఈ నెల 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా... ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్‌లో 'ఓజీ' ఫీవర్ కనిపిస్తోంది. తాజాగా టిల్లు భాయ్ సిద్ధు జొన్నలగడ్డ సైతం పవన్ హైప్ మామూలుగా లేదంటూ పోస్ట్ పెట్టారు. 'ఓజీ హైప్‌కు మా హెల్త్ అప్‌సెట్ అయ్యేలా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే రిలీజ్ తర్వాత మా పరిస్థితి ఏంటి. పవన్ సార్ మీరు పవన్ కాదు తుపాన్.' అంటూ ట్వీట్ చేయగా వైరల్ అవుతోంది. లుక్స్, సాంగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్స్, ప్రీ బుకింగ్ టికెట్స్ ఇలా నెట్టింట ఎక్కడ చూసినా 'ఓజీ' ట్రెండ్ అవుతోంది.
ఈ మూవీకి సాహో ఫేం సుజీత్ దర్శకత్వం వహించగా... పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 25న 'ఓజీ' థియేటర్లలోకి రానుంది.





















