OG Updates: పవన్ 'OG'లో శ్రియా రెడ్డి లుక్ రిలీజ్ - 'పొగరు'తో పవర్ ఫుల్‌గా గన్ టార్గెట్
Sriya Reddy First Look: పవన్ కల్యాణ్ 'OG' నుంచి మరో బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది. మూవీలో శ్రియా రెడ్డి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. గన్ టార్గెట్ చేస్తూ ఆమె లుక్ ఆకట్టుకుంటోంది.

Sriya Reddy First Look From Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG' నుంచి మరో లేటెస్ట్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ఈ మూవీలో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషిస్తుండగా... ఇప్పటికే అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ లుక్స్ రివీల్ చేశారు మేకర్స్. తాజాగా శ్రియా రెడ్డి లుక్ రిలీజ్ చేశారు.
గన్ ఎవరికి టార్గెట్?
ఎవరికో గన్ టార్గెట్ చేస్తూ సీరియస్ పవర్ ఫుల్ లుక్‌లో శ్రియా రెడ్డి అదరగొట్టారు. మూవీలో గీత అనే రోల్‍లో ఆమె కనిపించనున్నారు. 'గీత వచ్చేసింది.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా... 'పొగరు' మూవీ లుక్ రిపీట్ అయ్యిందని గూస్ బంప్స్ గ్యారెంటీ అని పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు. 'సత్య దాదా'గా ప్రకాష్ రాజ్ కనిపించగా... 'అర్జున్'గా అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్, బీజీఎం భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
View this post on Instagram
Also Read: 'OG' హైప్‌కు హెల్త్ అప్‌సెట్ అయ్యేలా ఉంది- 25 తర్వాత పరిస్థితి ఏంటి? టిల్లు భాయ్ ట్వీట్ వైరల్
సోషల్ మీడియాలో 'OG' ఫీవర్
అటు సోషల్ మీడియాలో 'OG' ఫీవర్ నెలకొంది. రిలీజ్‌కు ఇంకా 4 రోజులే ఉండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ వరుస పోస్టులతో రచ్చ చేస్తున్నారు. రీసెంట్‌గా టిల్లు బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా ఓజీ హైప్‌కు మా హెల్త్ అప్‌సెట్ అయ్యేలా ఉందంటూ ట్వీట్ చేశారు. 'సెప్టెంబర్ 25 తర్వాత మేము ఉంటామో పోతామో కూడా అర్థం కావడం లేదు. మీరు పవన్ కాదు ఓ తుపాను.' అంటూ పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్, బీజీఎంలు వేరే లెవల్‌లో ఉన్నాయి. ఇక థియేటర్స్ దద్దరిల్లడమే మిగిలి ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వెయిటింగ్ ఫర్ ట్రైలర్
ఈ మూవీ ట్రైలర్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక పవన్ స్వయంగా పాడిన పాటను శుక్రవారం రిలీజ్ చేశారు మేకర్స్. 'వాషి యో వాషి' అంటూ హైకూను స్టార్ట్ చేసిన పవన్ జపనీస్ భాషలో సాంగ్ అదరగొట్టారు. ఇదే ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపు సహా ప్రీమియర్, బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి.
పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేయగా... ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 25న గురువారం 'ఓజీ' ప్రేక్షకుల ముందుకు రానుంది.





















