Hridayapoorvam OTT: ఓటీటీలోకి మోహన్ లాల్ రొమాంటిక్ కామెడీ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పటినుంచంటే?
Hridayapoorvam OTT Platform: మలయాళ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ 'హృదయపూర్వం' నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

Mohanlal's Hridayapoorvam OTT Release On Jio Hotstar: మలయాళ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ 'హృదయపూర్వం'. ఆగస్ట్ 28న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మలయాళ ప్రేక్షకులను అలరించింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. నెల రోజుల్లోపే తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' సొంతం చేసుకోగా... ఈ నెల 26 నుంచి ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. సినిమాలో మోహన్ లాల్‌తో మాళవిక మోహనన్, ప్రేమలు ఫేం సంగీత్ ప్రతాప్, సంగీత మాధవన్ నాయర్, మీరా జాస్మిన్, బేసిల్ జోసెఫ్, సంగీత కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించగా... ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరంబావూర్ నిర్మించారు. జస్టిస్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించారు.
View this post on Instagram
Also Read: అమెరికాలో ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ - పాన్ వరల్డ్ రేంజ్ ప్రమోషన్స్ షురూ!
స్టోరీ ఏంటంటే?
కేరళ కొచ్చికి చెందిన సందీప్ బాలకృష్ణన్ (మోహన్ లాల్) రిచ్చెస్ట్ పర్సన్. క్లౌడ్ కిచెన్ ఫ్రాంచైజీలు రన్ చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తాడు. అలాంటి బాలకృష్ణన్‌కు హార్ట్ ప్రాబ్లమ్‌తో గుండె మార్పిడి చేయాల్సి వస్తుంది. అలా హార్ట్ సర్జరీ పూర్తైన తర్వాత ఓ ఎంగేజ్మెంట్ వేడుక కోసం పుణె వెళ్తాడు. తనకు గుండె ఇచ్చిన వ్యక్తి కూతురు హరిత (మాళవిక)దే ఆ ఎంగేజ్మెంట్ అని తెలుసుకుంటాడు. దీంతో ఆ ఫ్యామిలీకి మరింత దగ్గర కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు బాలకృష్ణన్.
సరిగ్గా ఇదే టైంలో వరుడు కుటుంబం ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తుంది. ఇక ఓ చిన్న ప్రమాదంలో గాయం కావడంతో కొచ్చికి వెళ్లలేక బాలకృష్ణన్ వారితోనే ఉండిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హరితకు నిజం తెలుస్తుందా? హరిత బాలకృష్ణన్ ఒక్కటవుతారా? హరిత పెళ్లి వేరే వ్యక్తితో జరుగుతుందా? తనకు గుండె ఇచ్చిన వ్యక్తి ఫ్యామిలీకి బాలకృష్ణన్ చేసిన సాయం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















