OG Updates: 'OG' హైప్‌కు హెల్త్ అప్‌సెట్ అయ్యేలా ఉంది- 25 తర్వాత పరిస్థితి ఏంటి? టిల్లు భాయ్ ట్వీట్ వైరల్
Pawan Kalyan: టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పవన్ కల్యాణ్ 'ఓజీ' హైప్‌పై చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ హైప్‌తో మా హెల్త్ ఏం కావాలంటూ ఆయన రాసుకొచ్చారు.

Siddhu Jonnalagadda Post On OG Movie: అటు సోషల్ మీడియాతో పాటు ఇటు వరల్డ్ వైడ్‌గా ప్రస్తుతం ఒకటే ఫీవర్. అదే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ'. 'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వంలో ఈ హై యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మరో 4 రోజుల్లోప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పవర్ స్టార్ ఫ్యాన్స్ నెట్టింట రచ్చ లేపుతూ సంబరాలకు రెడీ అవుతున్నారు. థియేటర్లలో సందడి చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వరుస పోస్టులతో రచ్చ చేస్తుండగా... తాజాగా యంగ్ హీరో, రౌడీ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సైతం పోస్ట్ చేశారు. దీన్ని పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
బిగ్ హైప్... మా హెల్త్‌పై ఎఫెక్ట్
పవన్ 'ఓజీ' హైప్ మామూలుగా లేదని... మా హెల్త్ ఏం కావాలంటూ తనదైన స్టైల్‌లో పోస్ట్ చేశారు సిద్ధు. 'OG హైప్ ఎఫెక్ట్ మా హెల్త్‌పై పడేలా ఉంది. సెప్టెంబర్ 25 వరకూ మేం ఉంటామో పోతామో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే 25 తర్వాత మా పరిస్థితి ఏంటో? పవన్ కల్యాణ్ గారు. మీరు పవన్ కాదు, తుపాను.' అంటూ రాసుకొచ్చారు. దీన్ని డైరెక్టర్ సుజిత్‌కు ట్యాగ్ చేస్తూ 'ఓజీ' అద్భుతం అంటూ రాసుకొచ్చారు.

Also Read: సాయి దుర్గా తేజ్ 'సంబరాల ఏటిగట్టు' వాయిదా - అసలు రీజన్ ఏంటంటే?
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు మూవీ టీం ఒక్కో రోజు ఒక్కో సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇప్పటికే హంగ్రీ చీతా, ట్రాన్స్ ఆఫ్ ఓమి బీజీఎంల దగ్గర నుంచి 'ఫైర్ స్ట్రోమ్', సువ్వి సువ్వి సాంగ్స్ రిలీజ్ చేయగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ఏకంగా పవన్ కల్యాణ్ పాడిన పాటను శుక్రవారం మేకర్స్ రిలీజ్ చేశారు. 'ఓమి మై డియర్ ఓమి... ఎగిరెగిరి పడుతున్నావ్! నీలాంటి వాడిని నేలకు ఎలా దించాలో నాకు బాగా తెలుసు.' అంటూ 'వాషి యో వాషి' అంటూ హైకూను స్టార్ చేసిన పవన్... 'చిన్నప్పుడు నా గురువు చెప్పిన హైకూ చెబుతా విను.' అంటూ జపనీష్ భాషలో పాట పాడి సందడి చేశారు. ఇది విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ట్రెండింగ్ అవుతోంది.
ట్రైలర్ ఎప్పుడంటే?
ప్రస్తుతం అందరి దృష్టి ట్రైలర్‌పైనే ఉంది. ఈ నెల 21న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాతో పాటు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతి ఇవ్వగా... తెలంగాణలోనూ ప్రీమయర్లతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
'ఓజీ'లో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా... బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు. వీరితో పాటే శ్రియారెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ మూవీని నిర్మించారు. ఈ నెల 25న పాన్ ఇండియా స్థాయిలో మూవీ రిలీజ్ కానుంది.






















