Nara Lokesh News: కడప మహిళకు కువైట్‌లో ఇబ్బందులు, సాయం చేస్తానని మాటిచ్చిన నారా లోకేష్
Kadapa woman in Kuwait | కడప మహిళ కువైట్‌లో ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి రాగానే ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. స్వదేశానికి రప్పించేందుకు సాయం చేస్తానని మాటిచ్చారు.

Andhra Pradesh News | రాయచోటి: ఏపీకి చెందిన కొందరు పని నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో యజమానుల చేతిలో బంధి అయిన వారిని, జీతాలు ఇవ్వకపోవడంతో ఖర్చులకు సైతం డబ్బుల్లేక పస్తులున్న వారిని ఏపీ ప్రభుత్వం ఆదుకుంది. ఇదివరకే కొందరు కార్మికులను మంత్రి నారా లోకేష్ క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చారు. తాజాగా ఏపీకి చెందిన మరో మహిళ తనను భారత్ కు తిరిగి తీసుకురావాలని కోరుతూ కన్నీళ్లు పెట్టుకుంది. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ బాధితురాలికి సాయం చేస్తానని మాటిచ్చారు.
అసలేం జరిగిందంటే..
కడప జిల్లాలోని రాయచోటికి చెందిన చెనం సేట్టి జయశ్రీ కువైట్‌లో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. మూడు నెలల క్రితం అప్పుల బారి నుంచి బయటపడటానికి ఉద్యోగం కోసం ఆమె గల్ఫ్ దేశానికి వెళ్లారు. అయితే, కుటుంబ సభ్యులకు చేసిన ఫోన్ కాల్ చేసిన జయశ్రీ తన యజమానులు వేధిస్తున్నారని.. తాను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిపింది. త్వరగా భారత్‌కి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తన బంధువులను ఆమె వేడుకుంది. జయశ్రీ కుటుంబ సభ్యులు ఆమెను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. (సంప్రదించవలసిన నెంబర్: 9160011780)
We will bring Jayasri Garu back safely @ashuvemulapalli Garu. @officeofNL, please coordinate! https://t.co/mIosHA0BHk
— Lokesh Nara (@naralokesh) September 20, 2025
తన దృష్టికి రాగానే స్పందించిన మంత్రి నారా లోకేష్
ఈమె పేరు చెన్నంశెట్టి జయశ్రీ. ఆమె స్వస్థలం కడప జిల్లా రాయచోటి పక్కనే పల్లెటూరు. ఆర్ధిక సమస్యలతో మూడునెలల క్రితం ఆమె ఉద్యోగం కోసం ఆమె కువైట్ వెళ్లారు. అక్కడ ఓనర్లు టార్చర్ చేస్తున్నారని, ఆ కష్టాలు భరించలేక కన్నీళ్లు పెట్టుకుంది. ఇండియాకి వచ్చేయడానికి ప్రయత్నాలు చేస్తోన్న తనని ఇక్కడికి తీసుకురావడానికి సాయం చేయాలని కోరిన వీడియోను మంత్రి నారా లోకేష్ చూసి స్పందించారు. ప్రస్తుతం ఆమె కువైట్ లోని ALADAN AL QASOUR BLOCK-1, HOUSE-1 లో ఉంటున్నారని, ఆమె వాట్సాప్ నంబర్ 9160011780 ఇది అని హెల్ప్ చేయాలని కోరారు. తన ఆఫీసు వాళ్లను సంప్రదిస్తుందని, కచ్చితంగా ఆమెను తిరిగి వస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.






















