Election Results 2024 LIVE: కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం
Assembly Election Results 2024 LIVE:హర్యానా, జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న ఓట్ల లెక్కింపుతోపాటు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు ఇక్కడ చూడొచ్చు
LIVE
Background
Assembly Election Results 2024 LIVE: హర్యానా, జమ్మూ, కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల 2024 ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. దీంతో ట్రెండ్ మొదలైంది. ఈ ట్రెండ్స్ ద్వారా ముందంజలో ఏ పార్టీ ఉందో, ఏది వెనుకబడి ఉందో తెలుసుకోవచ్చు. మధ్యాహ్నానికి ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదనే విషయంపై దాదాపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
హర్యానాలో అధికారాన్ని నిలుపుకొని హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం అక్కడ అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నించింది. ఆ పార్టీ ప్రయత్నాలు మంచి ఫలితాలే ఇస్తాయని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. పదేళ్ల తర్వాత హర్యానాలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తోంది.
జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. దీని నుంచి లడఖ్ వేరు చేశారు. ఆర్టికల్ 370 తొలగించారు. ఈ రాష్ట్ర రాజకీయ పార్టీలు ఎదుర్కొంటున్న సవాళ్లు అలాగే ఉన్నాయి. కొన్నిసార్లు నేషనల్ కాన్ఫరెన్స్, కొన్నిసార్లు కాంగ్రెస్, కొన్నిసార్లు PDP-BJP కూటమి ఇక్కడ అధికారంలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో మరికొద్ది సేపట్లో తేలిపోనుంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత బిజెపి, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న మొదటి ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో గెలిచే పార్టీ తర్వాత జరిగి మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్నికల్లో ప్రధాన పార్టీలు BJP, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD)-బహుజన్ సమాజ్ పార్టీ (BSP), జననాయక్ జనతా పార్టీ (JJP)-ఆజాద్ సమాజ్ పార్టీ (ASP) హర్యానాలో పోటీ పడ్డాయి. హర్యానాతోపాటు ఓటింగ్ జరిగిన జమ్మూకశ్మీర్‌లో అత్యధిక స్థానాల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్యనే ప్రత్యక్ష పోటీ జరిగింది.
హర్యానా లో ఒకే దశలో ఓటింగ్ జరిగితే 67.90% ఓటింగ్ నమోదు అయింది. ఇక్కడ 90 అసెంబ్లీ సీట్లుఉన్నాయి. మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 464 స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. మొత్తం పోటీ చేసిన అభ్యర్థుల్లో 101 మంది మహిళలు ఉన్నారు. అనేక ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది.
జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే... 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరిగింది. 873 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంలో మొదటి ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటుకు ఈ ఎన్నికలు జరిగాయి. జమ్మూకశ్మీర్‌ను జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన ఐదేళ్ల తర్వాత ఈ ఎన్నికలు జరిగాయి.
ఫరూఖ్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్‌తో పాటు ఫరూక్ కుమారుడు మరియు మెహబూబా కుమార్తె కూడా పోటీలో ఉన్నారు. ప్రముఖ అభ్యర్థులలో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు చెందిన సజ్జాద్ గని లోన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా (బట్మలూ) బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా పోటీలో ఉన్నారు.
జమ్మూకశ్మీర్‌లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ (NC) కూటమి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP), భారతీయ జనతా పార్టీ (BJP) పోటీ పడుతున్నాయి.
Haryana Assembly Election Results 2024: కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం
Haryana Assembly Election Results 2024: హర్యానాలో ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ఓట్ల లెక్కింపును నెమ్మదిగా అప్‌డేట్ చేస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఎన్నికల సంఘం పేర్కొంది.
Assembly Election Results 2024 Live : ఓటమి అంగీకరించిన మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ
Assembly Election Results 2024 Live : మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ తన ఓటమిని అంగీకరించారు. బిజ్‌బెహరా ప్రజల నుంతి పొందిన ప్రేమ ఎప్పుడూ తనను ముందుకు నడిపిస్తుందని ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో తను మద్దతుగా నిలిచిన పీడీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
Assembly Election Results 2024 Live : హర్యానాలోని పట్టణ ప్రాంతాల్లో సత్తా చాటిన BJP
Assembly Election Results 2024 Live : హర్యానాలోని పట్టణ ప్రాంతాల్లో బీజేపీ సత్తా చాటింది. పట్టణ ప్రాంతాల్లోని 12 స్థానాల్లో బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో చూపింది. కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లోనే ముందంజలో ఉంది.
Assembly Election Results 2024 Live : హర్యానాలో భారీ ఆధిక్యం దిశగా బీజేపీ - 50పైగా సీట్లలో ముందంజ
Assembly Election Results 2024 Live : హర్యానా ట్రెండ్స్‌లో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. తుపాను వేగంతో వచ్చిన బీజేపీ 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరలు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
Assembly Election Results 2024 Live : హర్యానాలో మెజారిటీ దిశగా బీజేపీ - వెనుకబడిన కాంగ్రెస్
Assembly Election Results 2024 Live : హర్యానా ట్రెండ్స్‌లో బీజేపీ మ్యాజికల్ ఫిగర్‌కు చేరుకుంది. బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే... కాంగ్రెస్ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.