అన్వేషించండి

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Revanth Reddy About Exit Poll Results 2023: గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను కామారెడ్డిలో ఓడిస్తున్నందుకు సంతోషంగా ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

ABP CVoter Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ముగిసి, ఈవిఎంలు సీల్ చేసి, స్ట్రాంగ్ రూంలకు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎంత రాత్రైనా పోలింగ్ ఎంత శాతం నమోదైందన్న వివరాలను ఎన్నికల సంఘం ఈ రోజే వెల్లడించాలన్నారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈసీ ని డిమాండ్ చేస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను కామారెడ్డిలో ఓడిస్తున్నందుకు సంతోషంగా ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గజ్వేల్ నుంచి వదిలిపెట్టి కామారెడ్డికి వచ్చిన కేసీఆర్ ను కాంగ్రెస్ శ్రేణులు ఓడించాయన్నారు. కేసీఆర్ తనకున్న తెలివితేటలతో, హంగులు, ఆర్భాటాలు, దోచుకున్న సంపదతో తరతరాలు ఎన్నికలను ప్రభావితం చేసి అధికారంలో ఉంటానని భావించారు. అదే ఆలోచనతో బరిలోకి దిగిన కేసీఆర్ ప్లాన్ ను కామారెడ్డి ప్రజలు తిప్పికొట్టారని రేవంత్ పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ‘తెలంగాణ మలి దశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారికి ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. ఎన్నికల తేదీ, ఫలితాలకు.. శ్రీకాంతాచారి త్యాగానికి ఓ గొప్ప లింక్ ఉంది. నవంబర్ 29, 2009 నాడు శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని తెలంగాణ ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఉద్యమంలో ప్రాణ త్యాగాలు ఉంటాయని నిరూపించాడు. డిసెంబర్ 3న శ్రీకాంతాచారి తుదిశ్వాస విడిచాడు. నవంబర్ 29, 2023న మొదలైన ఎన్నికల కార్యాచరణ డిసెంబర్ 3న ముగియనుంది. ఇది తాత్కాలికమే, యాధృచ్చికమో కాదు. కాలం, దేవుడు ఈ సమయం, సందర్భాన్ని కేసీఆర్ నుదుటిపై రాసిపెట్టిండు. ఏ పిల్లల త్యాగాలను కేసీఆర్ వాడుకున్నారో, సరిగ్గా అవే రోజుల్లో కేసీఆర్ పతనం జరుగుతోంది. 

తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియ డిసెంబర్ 9, 2009న అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నిర్ణయం తీసుకోగా కేంద్రం కీలక విషయాన్ని ప్రకటించింది. ఇప్పుడు అదే డిసెంబర్ 9న తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కొందరు ఈ మాటలు విని నవ్వుకున్నారు. అసాధ్యమన్నారు. షబ్బీర్ అలీని, నన్ను వేరే దారి చూసుకోమన్నారు. తెలంగాణ సమాజంలో చైతన్యంపై, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నమ్మకం ఉంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా పోరాటం కొనసాగిద్దామని నిర్ణయించుకుని పరిచేశాం. దేశంలోని అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అధికారం వస్తుందని చెప్పాయి. అంటే తెలంగాణ ప్రజల నాడీ అందరికీ ఒకేలా అర్థమైంది. 30 లక్షల నిరుద్యోగులకు, ఆనాడు ఉద్యమంలో పోరాటం చేసినవారికి, బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడిన వారికి సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుకునే సందర్భం వచ్చింది. ఆరోగ్యం బాగోలేని కారణంగా తాను తెలంగాణకు రాలేకపోతున్నానని, తన మనసులో మాటను సోనియా గాంధీ వీడియో రూపంలో కోరారు. అందుకు తెలంగాణ సమాజం స్పందించి సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇది తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యం’ అన్నారు రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !
లంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో .. కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది కానీ.. అదే సమయంలో హంగ్ అసెంబ్లీ అంచనాలను కూడా తోసిపుచ్చలేమని ఏబీపీ సీఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో స్పష్టమయింది.  కాంగ్రెస్ పార్టీకి  49 నుంచి 65 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని తేలింది. అదే సమయంలో భారత రాష్ట్ర సమితికి 38  నుంచి 54 సీట్లు వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కూటమికి మూడు నుంచి 13 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇతరులు 5 నుంచి 9 స్తానాల్లో గెలుస్తారు. ఇతరుల్లో మజ్లిస్ పార్టీ కూడా ఉంది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget