Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
3 officials suspension in Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.

Central zone DCP Suspension: హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్ లో ముగ్గురు పోలీసులను ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. సెంట్రల్ జోన్ డీసీపీ ఎం వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ ఏ యాదగిరి, ముషీరాబాద్ ఇన్ స్పెక్టర్ జహంగీర్ లపై సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. ముషీరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి (Musheerabad BRS Candidate) సంబంధిత వ్యక్తులు డబ్బులు పంచుతుంటే చర్యలు తీసుకోలేదని అభియోగాలున్నాయి.
ఓ అపార్ట్ మెంట్ లో ఓటర్లకు డబ్బులు పంచుతూ ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుమారుడు ముఠా జయసింహా పట్టుబడ్డారు. అయితే ఈ కేసులో ముఠా జయ సింహాను పోలీసులు తప్పించి, మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. ఎమ్మెల్యే కొడుకుకు సహకరించినందుకు సిఐ, ఏసీపీ , డీసీపీ లను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
సెంట్రల్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన A.శ్రీనివాస్
సెంట్రల్ జోన్ డీసీపీగా ఏ శ్రీనివాస్, చిక్కడపల్లి ఏసీపీగా మదన్ మోహన్, ముషీరాబాద్ ఇంచార్జ్ సిఐ గా వెంకట్ రెడ్డిలు బాధ్యతలు స్వీకరించారు. నగదు పంపిణీ జరుగుతుంటే చర్యలు తీసుకోని కారణంగా ముషీరాబాద్ సిఐ , ఏసీపీ , డిసిపి సస్పెండ్ అనంతరం వీరిని ఆ స్థానాల్లో నియమించారు. ముషీరాబాద్ నియోజకవర్గం లోని బోలక్ పూర్ లో పోలింగ్ బూత్ లను కొత్త డీసీసీ సందర్శించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పని చేస్తామన్నారు. ప్రజలు ఎవరు ప్రలోభాలకు లోనవకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొడుకు ముఠా జై సింహా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
మెదక్ లో ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్
తెలంగాణ ఎన్నికలు 2023లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కేంద్ర / రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో పనిచేయాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కూల్చారం మండలంలోని పైతరా గ్రామంలో గ్రామంలో నీటి సరఫరా చేసే ఉద్యోగి బట్ట జీవయ్య ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రాజకీయ పార్టీలో చేరి ప్రచారం చేస్తూ విధులను నిర్లక్ష్యం చేశాడని C- విజిల్ యాప్ ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదుపై ఉన్నత శాఖల అధికారులు విచారణ చేయగా, అది నిజమేనని తేలడంతో ఉద్యోగి జీవయ్యను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు .
మాసాయిపేటలోని పశు సంవర్ధకశాఖ లోని ప్రాథమిక కేంద్రంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న కె. విద్యాసాగర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా గ్రామంలో రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న ప్రచారంలో పార్టీ కండువా వేసుకుని ప్రచారం చేశారని, వీడియో రికార్డుతో ఫిర్యాదు వచ్చింది. వివిధ శాఖ అధికారులతో నిర్ధారణ చేయగా, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పనిచేసినట్లు రుజువైనందున సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ ప్రచారాలలో పాల్గొనకూడదని, ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవలసివస్తుందని బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఓ ప్రకటనలో తెలిపారు.
Also Read: Voting Procedure: ఇలా చేస్తే మీరు ఓటు వేసినా నో యూజ్! - పర్ఫెక్ట్ ఓటింగ్‌కి ఈ సూచనలు పాటించండి
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

