అన్వేషించండి

Telangana: బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు, వలసలతో కేసీఆర్‌ ఉక్కిరిబిక్కిరి

former Brs Mps into Bjp : బీఆర్‌ఎస్‌ నేతలు వరుసగా గోడ దూకేస్తున్నారు. మరో ఇద్దరు బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో ఆదివారం సాయంత్రం చేరిపోయారు.

Telangana Elections 2024: రాష్ట్ర విభజన తరువాత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్‌ నేతృత్వంలోని పార్టీ విజయం సాధించింది. కేసీఆర్‌ రెండోసారి సీఎం అయిన తరువాత రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా అనే పరిస్థితులు తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీకి చెందిన బలమైన నేతలను అప్పటి టీఆర్‌ఎస్‌/బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. తొలి ఎన్నికల్లో విజయం తరువాత కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నికైన ఎంతో మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా చేశారు. రెండోసారి కూడా అదే వ్యూహాన్ని అనుసరించిన కేసీఆర్‌ రెండు పార్టీలను బలోపేతం కాకుండా చేశారు. ఇప్పుడు అదే కేసీఆర్‌కు వలసలు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. అధికారం కోల్పోగానే బీఆర్‌ఎస్‌ నేతలు వరుసగా గోడ దూకేస్తున్నారు. మొన్నటి వరకు పార్టీలోకి వచ్చిన నేతలే తప్పా.. వెళ్లిన నేతలు లేని బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు వలసలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

ఇరు పార్టీల్లోకి జోరుగా వలసలు

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌, బీజేపీలోకి వెళుతున్న నేతల సంఖ్య భారీగా ఉంది. రెండు జాతీయ పార్టీలు ఆపరేషన్‌ ఆకర్స్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలు ఇరు పార్టీల్లో చేరిపోయారు. వీరిలో పెద్దపల్లి ఎంపీ వెంకటేషన్‌ కాంగ్రెస్‌లో చేరిపోగా, పోతుగంటి రాములు, బీబీ పాటిల్‌ బీజేపీలో చేరారు. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జెడ్పీ చైర్మన్లు తీగల అనితారెడ్డి, సునీత మహేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, తీగల కృష్ణారెడ్డి వంటి ఎంతో మంది నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరితోపాటు ప్రతి జిల్లా, నియోజకవర్గాల్లోనే ద్వితీయ శ్రేణి నేతలు భారీగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోతున్నారు. ఇవన్నీ బీఆర్‌ఎస్‌కు మింగుడు పడడం లేదు. గతంలో పార్టీలో చేరిన నేతలే తప్పితే.. పార్టీ నుంచి వెళ్లిన నేతలు గురించి తెలియని బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులకు.. ఈ వ్యవహారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 

మరో ఇద్దరు ఎంపీలు బీజేపీలోకి

తాజాగా మరో ఇద్దరు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో ఆదివారం సాయంత్రం చేరిపోయారు. మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, గోడం నగేశ్‌ బీజేపీలో చేరిపోయారు. అలాగే, హుజూర్‌నగర్‌, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావు ఢిల్లీలో ఆ పార్టీ సీనియర్‌ నేత తరుణ్‌చుగ్‌ సమకంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు లక్ష్మణ్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందని ఈ సందర్భంగా బీజేపీ నేతలు పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget